తెలంగాణ

telangana

ETV Bharat / health

పరగడుపున బొప్పాయిని తింటే గుండె సమస్యలు రావు! ఇమ్యూనిటీ, చర్మ సౌందర్యం మీ సొంతం!! - Advantages Of Papaya

Health Benefits Of Papaya : ఉదయం పూట బొప్పాయి పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది జీర్ణక్రియను, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే గాక అనేక విధాలుగా మీ శరీరానికి మేలు చేస్తుంది. వీటిల్లో ఉండే పోషకాలు షుగర్​, గుండె జబ్బు పేషెంట్​లకూ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. మరి బొప్పాయి ద్వారా కలిగే మరిన్ని ఆరోగ్య లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Health Benefits Of Papaya
Health Benefits Of Papaya

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 7:22 AM IST

Health Benefits Of Papaya : బొప్పాయి- ఇది సంవత్సరం పొడవునా లభించే పండు. ఇందులో విటమిన్లు, మినరల్స్​ సహా మరెన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అనేక ఆరోగ్య సమస్యల నుంచి బొప్పాయి మనల్ని రక్షిస్తుంది. వేడి నుంచి శరీరానికి ఉపశమనం కలిగించే గుణాలూ బొప్పాయి పండులో ఉంటాయి. అంతేకాకుండా మరెన్నో ఆరోగ్య లాభాలను కలిగిస్తుంది ఈ బొప్పాయి. ఈ నేపథ్యంలో ఉదయాన్నే బొప్పాయిని ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణక్రియ మెరుగవుతుంది
ఉదయాన్నే బొప్పాయి పండు తినడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. బొప్పాయిలో 'పపాయిన్' అనే ఎంజైమ్​ ఉంటుంది. ఇది మీరు తీసుకున్న ఆహారంలోని ప్రోటీన్లను శరీరానికి అందేలా చేస్తుంది. అంతేకాకుండా ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చూస్తుంది. బొప్పాయిలో ఉండే ఫైబర్​ మలబద్ధకం సమస్యనూ నివారిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది
బొప్పాయిలో విటమిన్​-సీ అధికంగా ఉంటుంది. దీన్ని రోజూ అల్పాహారంగా తీసుకోవడం ద్వారా మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరగుతుంది. అలాగే అనేకమైన ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల బారి నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

బరువు తగ్గేందుకు సహాయపడుతుంది
బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే బొప్పాయిని తినడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే పపాయిన్​, ఫైబర్​ మీ శరీరంలోని అధిక కొవ్వును కరిగించేందుకు సహాయపడతాయి. తద్వారా మీ శరీర బరువును సులువుగా తగ్గించుకోవచ్చు.

చర్మ ఆరోగ్యం
బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్​లు, మినరల్స్​ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మారుస్తాయి. రోజూ ఉదయాన్నే బొప్పాయి తినడం ద్వారా మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

నొప్పుల నుంచి ఉపశమనం
తరచూ ఇబ్బందులకు గురిచేసే కీళ్ల నొప్పులు, కండరాళ్ళ వాపు లాంటి ఆర్థరైటిస్​ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఉదయాన్నే బొప్పాయి పండును తినడం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు. అంతేకాకుండా మధుమేహం, గుండె జబ్బులు సహా ఇతర ఆరోగ్య సమస్యల ద్వారా వచ్చే మంటను బొప్పాయి తగ్గిస్తుంది.

ఆరోగ్యకరమైన గుండె కోసం
ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్​ లెవెల్స్​ తగ్గుతాయి. బొప్పాయిలో 'లైకోపీన్' ఉంటుంది. ఇది మీ గుండెను ఆరోగ్యకరంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం తగ్గుతుంది.

కంటిచూపును మెరుగుపరుస్తుంది
బొప్పాయిలో విటమిన్​-సీ, విటమిన్​-ఈ, బేటా కెరోటిన్​ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రతిరోజూ ఉదయం పూట బొప్పాయిని తినడం ద్వారా వయసు సంబంధిత సమస్యలు, కంటి సమస్యల భారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఆయిల్ రాసినా మీ జుట్టు గడ్డిలా ఎండిపోతోందా? - ఈ టిప్స్​తో చెక్ పెట్టండి!

స్కార్ఫ్‌ ధరిస్తే మొటిమలు వస్తున్నాయా? - క్రీమ్స్ వాడకుండా ఇలా తగ్గించుకోండి!

ABOUT THE AUTHOR

...view details