Health Benefits of Papaya:మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా బాడీకి సరైన పోషకాలు అందించి హెల్తీగా ఉంచడంలో ఫ్రూట్స్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సీజన్‌తో సంబంధం లేకుండా లభించే పండ్లలో బొప్పాయి(Papaya)ఒకటి. ఇది మార్కెట్లోనే కాదు చాలా మంది ఇంటి ఆవరణల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పండు రుచిగా ఉండడమే కాదు.. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా బాడీలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపేందుకు మార్నింగ్ టైం బెస్ట్. అందుకే ఆరోగ్య నిపుణులు మార్నింగ్ లేవగానే వాటర్ తీసుకోవాలని చెబుతారు. ఇక అదే సమయంలో పండ్లు తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. ముఖ్యంగా మార్నింగ్ ఖాళీ కడుపుతో బొప్పాయి తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయని సూచిస్తున్నారు. మరి ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పోషకాలు ఫుల్: రోజూ ఖాళీ కడుపుతో ఒక గిన్నె బొప్పాయి ముక్కలు తినడం వల్ల శరీరానికి వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అందడమే కాకుండా మలబద్ధకం బాధలను దూరం చేసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది బొప్పాయి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇక ప్రయోజనాల విషయానికొస్తే..
జీర్ణక్రియ మెరుగుదల : మీ డైట్లో బొప్పాయిని చేర్చుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అందులో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియలో తలెత్తే సమస్యలను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే చైమోపాపైన్.. ప్రొటీన్లను విచ్ఛిన్నం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. మొత్తంగా ఇందులో ఉండే పోషకాలు అజీర్ణాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తాయి. అదేవిధంగా దీనిని గట్ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ అనొచ్చు.
నేచురల్ డిటాక్సిఫికేషన్ : బొప్పాయిలో ఫైబర్, వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది మంచి నేచురల్ డిటాక్సిఫికేషన్గా పనిచేస్తుంది. అంటే బొప్పాయిని ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన మలినాలను సులభంగా తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుంది.