Alive Seeds Benefits For Moms : తగ్గడం, ఒక్కసారిగా బరువు పెరగడం, జుట్టు ఎక్కువగా రాలిపోవడం లాంటి వంటి సమస్యలు కొత్తగా తల్లైన మహిళల్లో కామన్ అంటున్నారు నిపుణులు. వీటన్నింటి నుంచి బయటపడేందుకు అలీవ్ గింజలు చక్కగా దోహదపడతాయని చెబుతున్నారు. మహిళలు ప్రసవానంతరం తిరిగి కోలుకోవడానికి తీసుకునే పదార్థాల్లో అలీవ్‌కు ప్రత్యేక స్థానం ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అలీవ్ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు
- కొత్తగా తల్లైన మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచడంలోనూ అలీవ్ గింజలు ముందుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
- ఐరన్, ఫోలికామ్లం, విటమిన్ 'ఎ', విటమిన్ 'ఇ', అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు... వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని, తద్వారా ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ దోహదం చేస్తాయంటున్నారు.
- సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాల్లో అలీవ్ గింజలు ఒకటి.
- కొత్తగా తల్లైన మహిళలతో పాటు మెనోపాజ్‌కు చేరువైన మహిళలు, యుక్తవయసుకు చేరువవుతోన్న అమ్మాయిలు, అలొపేషియా (మాడుపై అక్కడక్కడా జుట్టు రాలిపోయి తెల్లటి ప్యాచుల్లా ఏర్పడడం)తో బాధపడే వారు అలీవ్ గింజలను తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు.
- క్యాన్సర్ చికిత్స రోగులు వాళ్లు అలీవ్ గింజల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీమోథెరపీతో మంచి కణజాలాలపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చని నిపుణులు చెబుతున్నారు.
- మనసు బాగోలేనప్పుడు, తీపి తినాలన్న కోరిక కలిగినప్పుడు వీటిని తీసుకోవడం మంచిదంటున్నారు.
- పిల్లల్లో ఏకాగ్రత, సత్తువను పెంచడానికి అలీవ్ గింజలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
- ఈ గింజలను కొబ్బరి-నెయ్యితో తీసుకోవడం లేదంటే పాలల్లో కలిపి తీసుకోవడంతో ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
- అలీవ్ గింజల్ని తీసుకోవడం అలవాటు లేని వారు చిటికెడు మాత్రమే తీసుకోవాలని, ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అది కూడా పాలతో, లడ్డూల్లా చేసుకొని తీసుకోవాలని సూచిస్తున్నారు.
- పిగ్మెంటేషన్‌ని తగ్గించడంతో పాటుగా, జుట్టు ఒత్తుగా పెరగడం, సంతానోత్పత్తికి, మానసిక ఒత్తిళ్లు-ఆందోళనల్ని దూరం చేయడానికి అలీవ్ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఎవరు తీసుకోవచ్చు? : అలీవ్ గింజల్ని ఎవరైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు, యుక్తవయసుకు దగ్గరవుతోన్న అమ్మాయిలు / అబ్బాయిలు, మధ్య వయస్కులు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే జుట్టు రాలడం, చర్మం ప్యాచుల్లా మారడం, అలొపేషియా (మాడుపై అక్కడక్కడా జుట్టు రాలిపోయి తెల్లటి ప్యాచుల్లా ఏర్పడడం)తో బాధపడేవారు తీసుకుంటే సమస్యలు తగ్గుముఖం పడతాయంటున్నారు. అలాగే ఒత్తిడి నుంచి విముక్తి కల్పించేందుకూ ఈ గింజలు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫోలికామ్లం, ఐరన్, విటమిన్లు 'ఎ', 'ఇ' లాంటి వంటి పోషకాలు నిండి ఉన్న ఈ సూపర్ ఫుడ్ రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణలు చెబుతున్నారు.
ఎలా తీసుకోవాలి? :అలీవ్ గింజల్ని కొబ్బరి, నెయ్యి, బెల్లం కలిపి లడ్డూల్లా చేసుకొని తీసుకోవచ్చు. ఎక్కువగా మధ్యాహ్నం భోజనం సమయంలో తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పిల్లలకూ అందించచ్చు. రాత్రిపూట చిటికెడు అలీవ్ గింజల్ని పాలల్లో వేసి ఏడెనిమిది గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత తీసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.