Ginger Water Health Benefits : అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు ఎన్నో వ్యాధులను దూరం చేస్తాయి. ఆయుర్వేదం, యునాని మాత్రమే కాదు అలోపతీ సైతం ఆరోగ్యానికి అల్లం(Ginger) మేలు చేస్తుందని చెబుతోంది. అయితే అల్లాన్ని ఎక్కువగా కూరల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా టీలో కూడా వేసుకుంటారు. అయితే అల్లం టీ లాగే అల్లం నీరు తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వికారం తగ్గిస్తుంది :చాలా మంది మార్నింగ్ సిక్ నెస్‌తో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఉదయం లేవగానే పరగడుపున ఒక కప్పు గోరు వెచ్చని అల్లం వాటర్ తీసుకుంటే మంచి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు. అంతే కాదు, మోషన్ సిక్నెస్ లేదా కీమో సంబంధిత ప్రతికూల ప్రభావాలను కలిగి ఉన్నవారికి ఇది సహాయపడుతుంది. పురాతన కాలం నుంచి మసాలా దినుసులలో ఒకటిగా ఉన్న అల్లం, వికారం వంటి లక్షణాలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది : మీరు రోజూ పరగడుపున ఒక కప్పు అల్లం వాటర్ తీసుకోవడం కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు. ఎలాగంటే అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమెటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నొప్పులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.
చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది : మీరు డైలీ పరిగడుపున కప్పు గోరు వెచ్చని అల్లం వాటర్ తీసుకున్నారంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే అల్లంలో ఉండే పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఫలితంగా గుండె జబ్బులు, ఇతర కొలెస్ట్రాల్ సంబంధిత ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు.
Ginger Side Effects In Telugu : అల్లాన్ని ఎక్కువగా వాడుతున్నారా?.. అయితే జాగ్రత్త సుమా!