Health Benefits of Banana Peel :సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండే పండు.. అరటి. చౌక ధరకే లభిస్తూ అందరికీ తినడానికి సౌలభ్యంగా ఉంటుంది. అలాగే.. ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అయితే, మెజార్టీ పీపుల్ బనానా తిన్నాక తొక్క పడేస్తారు. మీరూ ఇలానే అరటి పండు తిన్న తర్వాత తొక్క పడేస్తున్నారా? అయితే, అరటి తొక్కతో(Banana Peel)లభించే ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఇకపై అస్సలు బయటపడేయరంటున్నారు నిపుణులు. పండు కంటే కూడా తొక్క ద్వారా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది : అరటిపండు తొక్కలలో పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ తొక్కలను ఎక్కువగా తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు పెరిగి క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని సూచిస్తున్నారు నిపుణులు.
కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు : అరటి తొక్కలు కరిగే, కరగని ఫైబర్లను కలిగి ఉంటాయి. వీటితో పాటు అరటిలోని పోషకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఫలితంగా గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చంటున్నారు.
కళ్లకు మేలు చేస్తాయి : బనానా తొక్కలలో ఉండే పోషకాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కంటిశుక్లం వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయట. అంతేకాదు.. అరటి తొక్కలు కంటి కింద ఉబ్బడం, నల్లటి మచ్చలను తగ్గించడంలోనూ చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం అరటి పై తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి.. వాటిని కంటి కింద 15 నిమిషాలు ఉంచి ఆపై క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుంటే తేడాను మీరే గమనించవచ్చంటున్నారు.
2018లో 'మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్' అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. అరటిపండు తొక్కలో ఉండే టానిన్లు చర్మ సంరక్షణలో చాలా సహాయపడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ అడెలిన్ కికామ్ పాల్గొన్నారు. అరటి తొక్కలలోని పోషకాలు చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు కంటి కింద నల్లటి వలయాలు, వాపు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.
అరటి పండ్లు ఆరోగ్యానికి మంచివే - కాని అతిగా తింటే ఈ ప్రాబ్లమ్స్ గ్యారెంటీ!