Headache When to see a Doctor :తలనొప్పి ఇబ్బంది పెడుతుంటే ఏ పనీ చేయలేరు. కొందరికి గంటల్లో తగ్గిపోతే.. మరికొందరి రోజుల వరకూ ఉంటుంది. చాలా మంది ఈ సమస్య వచ్చిపోయేదే అనుకొని లైట్ తీస్కుంటారు. కానీ.. తరచూ తలనొప్పి రావడం ఇతర అనారోగ్య సమస్యలకూ ఓ కారణం కావొచ్చని నిపుణులంటున్నారు. మరి.. తలనొప్పి గురించి ఎప్పుడు ఆందోళనచెందాలి ? ఎప్పుడు డాక్టర్ను కలవాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..
ఈ సమయంలో తలనొప్పిని లైట్ తీసుకోకండి!
- తీవ్రమైన తలనొప్పి, దగ్గు
- తరచూ తలనొప్పి
- జ్వరంగా ఉండి, మెడ బిగుసుకుపోయినట్లుగా అనిపించడం
- తలనొప్పితో పాటు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం
- మూర్ఛ, మాటలు సరిగా రాకపోవడం
- నరాలు బలహీనంగా మారడం, సరిగా చూడలేకపోవడం
- తలనొప్పి కారణంగా చదవడం, పని చేయడం, నిద్రించడంలో ఆటంకాలు
- ఉదయాన్నే నిద్రలేచినప్పుడు తలనొప్పిగా అనిపించడం
- కళ్లు ఎర్రగా మారడం
- ఏదైనా ప్రమాదంలో తలకు దెబ్బ తగిలి తలనొప్పి సమస్య వేధిస్తుంటే ఓ సారి మెడికల్ చెకప్ చేయించుకోవాలి.
- క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారిలో తలనొప్పి సమస్య తీవ్రంగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
తలనొప్పిలో రకాలు :
సాధారణంగా చాలా మందిలో ఏ అనారోగ్య సమస్యలు లేకుండా వచ్చే తలనొప్పి విశ్రాంతి తీసుకోవడం, కాఫీ/టీ తాగడం ద్వారా తగ్గిపోతుంది. అయితే, తలనొప్పిలో 300 కంటే ఎక్కువ రకాలున్నాయి. ఇందులో కేవలం 10 శాతం వాటికి మాత్రమే స్పష్టమైన కారణాలు తెలుసని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చీఫ్ మెడికల్ ఎడిటర్ డాక్టర్ హోవార్డ్ ఇ. లెవైన్ (Howard E. LeWine) తెలిపారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
ఒత్తిడి కారణంగా :
ఎక్కువమందికి ఒత్తిడి కారణంగా తలనొప్పి సమస్య వేధిస్తుంది. కొందరికి తలనొప్పితో పాటు భుజాలు, మెడ నొప్పి కూడా ఇబ్బంది పెడుతుంది. నార్మల్గా ఇటువంటి తలనొప్పి 20 నుంచి రెండుగంటలలో తగ్గిపోతుందట! సరైన సమయానికి భోజనం చేయడం, యోగా వంటివి చేయడం ద్వారా తలనొప్పిని అధిగమించవచ్చు.