Carrot Masks For Hair Growth :క్యారెట్‌లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, బి, సి, ఐరన్, కాల్షియంతో పాటు ఇతర పోషకాలు మీ ఆరోగ్యానికే కాదు.. జుట్టు సంరక్షణకూ చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా.. క్యారెట్‌తో(Carrot) కొన్ని పదార్థాలను కలిపి హెయిర్ ప్యాక్స్ చేసుకొని యూజ్ చేయడమే. ఫలితంగా ఏవైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే తొలగిపోయి.. జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుందంటున్నారు. ఇంతకీ, ఏంటి ఆ హెయిర్‌ప్యాక్స్? వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
క్యారెట్, అవకాడో మాస్క్ :ఇందుకోసం ముందుగా రెండు క్యారెట్స్, అవకాడో సగభాగం తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని మిక్సిలో వేసి మెత్తని పేస్ట్‌లా పట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని అందులో 2 టేబుల్ స్ఫూన్ల తేనె యాడ్ చేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని స్కాల్ప్ నుంచి జుట్టు కుదుళ్ల వరకు అప్లై చేసి స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆపై మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. పొడి జుట్టు ఉన్నవారు ఈ మాస్క్‌ని వాడితే జుట్టు మృదువుగా మారి ఒత్తుగా పెరుగుతుందంటున్నారు నిపుణులు.
క్యారెట్, ఆలివ్ ఆయిల్ మాస్క్ :ఇది కూడా జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా ఒక క్యారెట్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి అది ఆరేవరకూ ఉంచుకోవాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తల స్నానం చేయాలి.
2017లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజికల్ సైన్స్'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. క్యారెట్‌లో ఉండే విటమిన్ ఎ స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చుండ్రును తగ్గించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దక్షిణ కొరియాలోని 'సియోల్ యూనివర్సిటీ హాస్పిటల్'కు చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ యున్‌హి షిన్ పాల్గొన్నారు. క్యారెట్ సంబంధిత హెయిర్ మాస్క్‌లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయని ఆయన పేర్కొన్నారు.