Best Hair Mask for Hair Growth :ఉసిరిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవి జుట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని అంటున్నారు. ఉసిరిలో ఉండే కాల్షియం వంటి ఖనిజాలు.. ఎండ కలిగించే నష్టం నుంచి జుట్టును రక్షిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఇందులో అధికంగా ఉండే విటమిన్ C జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా.. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుందని చెబుతున్నారు. 2016లో "Journal of Ethnopharmacology"లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఉసిరిపొడిని జుట్టుకు యూజ్ చేసిన వారిలో తలపై వాపు తగ్గడమే కాకుండా జుట్టు పెరుగుదల గణనీయంగా పెరిగిందని పరిశోధకులు కనుగొన్నారు.
ఆయిల్ రాసినా మీ జుట్టు గడ్డిలా ఎండిపోతోందా? - ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి!
ఇక కొబ్బరి నూనెలో కూడా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో జీవక్రియను వేగవంతం చేయడంలో చాలా బాగా సహాయపడుతుందని ప్రముఖ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రింకీ కపూర్ చెబుతున్నారు. అంతేకాకుండా.. కొబ్బరి నూనె తలపై తేమను ఉంచడం ద్వారా.. జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుందని పేర్కొన్నారు. అలాగే.. హెయిర్ షాఫ్ట్‌ను ఆరోగ్యంగా ఉంచుతూ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని కపూర్ చెబుతున్నారు. దీంతోపాటు కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చికాకుగా ఉన్న స్కాల్ప్‌కు మంచి రిలీఫ్ కలిగిస్తాయని అంటున్నారు.