Hair Benefits Of Multani Mitti :ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల మొటిమలు, జిడ్డు చర్మం తగ్గిపోయి ఫేస్ అందంగా కనిపిస్తుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది అందరికీ తెలిసిందే! అయితే, ముల్తానీ మట్టితో కొన్ని రకాల హెయిర్ ప్యాక్‌లు వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోయి, ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే జుట్టుకి ఉన్న మురికిని, చుండ్రుని వదిలేలా చేస్తుందని.. జుట్టుకు కండిషనర్‌లా పనిచేసి కురులను మృదువుగా, మెరిసేలా చేస్తుందంటున్నారు. కాబట్టి, జుట్టు రాలడంవంటి సమస్యలతో బాధపడేవారు ముల్తానీ మట్టి హెయిర్ ప్యాక్‌లను ట్రై చేయాలని సూచిస్తున్నారు.
బియ్యప్పిండి, పెరుగు :ఒక గిన్నెలో ముల్తానీ మట్టి, బియ్యప్పిండి సమాన భాగాలుగా తీసుకోవాలి. ఇందులో కప్పు పెరుగు, ఓ గుడ్డులోని తెల్లసొన కలిపి మెత్తని పేస్టులా చేయాలి. దీనిని మాడు నుంచి జుట్టు చివర్లకు పట్టించాలి. ఒక అరగంట తర్వాత కెమికల్స్ లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు ఉన్న మురికి, చుండ్రు వదులుతుందని చెబుతున్నారు.
నిమ్మరసం, పెరుగు :ఒక గిన్నెలో నాలుగు చెంచాల ముల్తానీ మట్టిని తీసుకుని.. ఇందులో 2 చెంచాల నిమ్మరసం, చెంచా పెరుగు చేర్చి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఒక అరగంట తర్వాత రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచు చేయడం వల్ల కురులు నిగనిగలాడతాయి. ఈ మిశ్రమంలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు చుండ్రుని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
2017 లో "జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ముల్తానీ మట్టి చుండ్రును తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో పాకిస్తాన్‌లోని పంజాబ్ మెడికల్ కళాశాలకు చెందిన చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ షఫీక్ అహ్మద్ పాల్గొన్నారు.
అలర్ట్ : అమ్మాయిలూ అవాంఛిత రోమాలను షేవ్ చేస్తున్నారా? - ఈ తప్పులు చేస్తే కొత్త సమస్యలు!