ETV Bharat / sports

రోహిత్, కోహ్లీకి యూవీ ఫుల్​ సపోర్ట్ - 'వాళ్లిద్దరూ గతంలో ఏం సాధించారో ప్రజలు మర్చిపోయారు' - YUVARAJ SINGH ABOUT ROHIT AND VIRAT

ట్రోలర్స్​కు యూవీ స్ట్రాంగ్ కౌంటర్ - చెడుగా మాట్లాడటం చాలా ఈజీ, సపోర్ట్ చేయడం కష్టం

Yuvaraj Singh About Rohit And Virat
Yuvaraj Singh About Rohit And Virat (Associated Press, Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 7, 2025, 1:48 PM IST

Yuvaraj Singh About Rohit And Virat : బోర్డర్ గావస్కర్​ ట్రోఫీలో పేలవ ఫామ్​తో అభిమానులను ఆందోళన పెట్టారు స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ టెస్టుల్లో విఫలమవుతున్న ఈ ద్వయం, స్వదేశంలో కివీస్‌తో జరిగిన టెస్టు సిరీసుల్లో విఫలమై అందరినీ కలవరపెడుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్, విరాట్‌పై పలువురు మాజీలు, అలాగే అభిమానుల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జట్టు నుంచి తప్పుకోవాలంటూ మండిపడుతున్నారు. అయితే, తాజాగా టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్ ఈ ఇద్దరి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

"నావరకూ ఈ బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ ఓటమి కంటే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ కోల్పోవడమే బాధాకరం. ఎందుకంటే స్వదేశంలో 0-3తో వైట్‌వాష్‌ అయింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆస్ట్రేలియాలో గత రెండుసార్లు భారత్ గెలిచింది. కానీ ఈసారి ఓడింది. గొప్ప ప్లేయర్లైన విరాట్, రోహిత్​లపై కామెంట్ చేస్తున్నారు. వారి గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఆ ఇద్దరూ గతంలో ఏం సాధించారో ప్రజలదంరూ మర్చిపోయారు. ఈ కాలపు గొప్ప క్రికెటర్లలో రోహిత్, కోహ్లీ కూడా ఉంటారు. టీమ్ఇండియా ఓడింది. వారిద్దరూ బాగా పెర్ఫామ్​ చేయలేకపోయారు. అందుకు వారు మనకంటే ఎక్కువగానే బాధ పడుతున్నారు. కోచ్‌ గౌతమ్ గంభీర్, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్ అగార్కర్, రోహిత్, విరాట్, బుమ్రాలకు మంచి క్రికెట్ మైండ్ ఉంది. ఫ్యూచర్​లో భారత క్రికెట్‌ ఎలా ముందుకుసాగాలో వారే డిసైడ్ అవ్వాలి. బాగా ఆడకపోతే కెప్టెన్‌ స్వయంగా జట్టు నుంచి బయటకువెళ్లడం గతంలో నేనెప్పుడూ చూడలేదు. తనకంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమంటూ రోహిత్ ఆ డెసిషన్ తీసుకున్నాడు. ఇది అతడి గొప్పతనం. ఓడినా, గెలిచినా సరే అతను ఓ గొప్ప కెప్టెన్. రోహిత్ నాయకత్వంలోనే వన్డే ప్రపంచ కప్‌ వరకు వెళ్లాం. టీ20 ప్రపంచకప్ కూడా సాధించాం. ఇంకా ఎన్నో కూడా గెలుచుకున్నాం. ప్లేయర్స్ సరిగ్గా ఆడనప్పుడు వారి గురించి చెడుగా చెప్పడం సులభం. కానీ వారికి సపోర్ట్​గా నిలవడం చాలా కష్టం. వారి గురించి చెడుగా మాట్లాడటమే మీడియా పని. రోహిత్, విరాట్ నా ఫ్యామిలీ లాంటి వారు. నా కుటుంబం, సోదరులకు మద్దతుగా నిలవడం నా విధి" అంటూ యువరాజ్‌ ఆ ఇద్దరికి సపోర్ట్ చేశాడు.

'రోహిత్, కోహ్లీ ఎంత తోపులైనా- వారికి చెప్పాల్సిన బాధ్యత కోచ్​దే!'

'మొదట్లో తప్పు అన్నారు- కానీ, అదే అతడి బలం'- ఈటీవీ భారత్​తో బుమ్రా కోచ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.