Can We Drink Green Tea in Summer : ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు ఆరోగ్యానికి మంచిదని గ్రీన్ టీ తాగుతున్నారు. డైలీ ఈ టీని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు, ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు సైతం చెబుతున్నారు. అయితే, కొంతమందికి సమ్మర్‌లోగ్రీన్ టీ తాగడం మంచిదేనా అని సందేహం కలుగుతుంది ? మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
గ్రీన్ టీని పోషకాల పవర్ హౌజ్ అని కూడా అంటుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, కాటెచిన్స్, ఆమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ టీ తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కూడా మనం సొంతం చేసుకోవచ్చు. అయితే వేసవి కాలంలో గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. సమ్మర్‌లో ఈ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని అంటున్నారు.
గ్రీన్ టీ తాగడం వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బరువు తగ్గుతారు :గ్రీన్ టీలో పాలీఫెనాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో కొవ్వును వేగంగా కరిగిస్తుంది. అలాగే పొట్ట చుట్టూ ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఈ గ్రీన్ టీ తాగాలని సూచిస్తున్నారు. 2018లో "అపెటైట్" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. గ్రీన్ తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని డాక్టర్. అకిర ఇమాముర (Dr. Akira Imamura) పాల్గొన్నారు. అధిక బరువుతో బాధపడే వారు రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
షుగర్ అదుపులో :ప్రస్తుతం డయాబెటిస్ బాధితులు సంఖ్య పెరుగుతుంది. అయితేషుగర్ వ్యాధితో బాధపడేవారు రోజూ ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని అంటున్నారు.