Gallbladder Stone Removal Without Surgery:ఈ మధ్య కాలంలో చాలామందిని గాల్ బ్లాడర్‌లో (పిత్తాశయం) రాళ్ల సమస్య వేధిస్తుంది. ఈ సమస్య వల్ల కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే వీటిని కరిగించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, దీనికి ఆయుర్వేద పద్ధతిలో చక్కటి పరిష్కారం ఉందని నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవి చెబుతున్నారు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 220 గ్రాముల కటుక రోహిని చూర్ణం
- 60 గ్రాముల త్రిఫల చూర్ణం
- 40 గ్రాముల చిత్ర మూలం చూర్ణం
- 40 గ్రాముల సుద్ద గుగ్గులు చూర్ణం
- 30 గ్రాముల శిలాజత్తు చూర్ణం
- తగినంత వేపాకు రసం
- తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెను తీసుకుని అందులో కటుక రోహిని చూర్ణం, త్రిఫల చూర్ణం, చిత్ర మూల చూర్ణం, సుద్ద గుగ్గులు చూర్ణం, శిలాజత్తు చూర్ణం వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత ఇందులో వేపాకు రసం పోసి చాలా సేపు మర్థన చేయాలి.
- ఈ మిశ్రమం మొత్తం ముద్దలాగా తయారయ్యేంత సేపు మర్ధన చేసి.. వాటిని చిన్న మాత్రలాగా చేసుకోవాలి.
- ఈ మాత్రలను ఉదయం, రాత్రి రెండు పూటల రెండు మాత్రలను వేసుకుని గోరు వెచ్చని నీటిని తాగాలని చెబుతున్నారు. ఇలా అవసరాన్ని బట్టి 2-3 నెలల పాటు వేసుకుంటే గాల్ బ్లాడర్లోని రాళ్లు సులభంగా కరుగుతాయని అంటున్నారు.
కటుక రోహిని: ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపించడంలో చాలా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. చేదుగా ఉండే ఈ కటుక రోహిని కాలేయానికి టానిక్‌లాగా పనిచేస్తుందని వివరిస్తున్నారు. ఇంకా గాల్ బ్లాడర్‌లో ఉన్న రాళ్లను కరిగించడానికి కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు.
త్రిఫలాలు: ఉసిరి కాయలు, కరక్కాయాలు, తానికాయలను సమానంగా కలిపితే త్రిఫలాలు అని పిలుస్తారు. వీటికి శరీరంలోని మలినాలను బయటకు పంపించే గుణం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు వీటికి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. ఫలితంగా అనవసర పదార్థాలు పేరుకుపోకుండా చూస్తాయని వివరిస్తున్నారు.
చిత్ర మూలం: ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ఫలితంగా గాల్ బ్లాడర్‌లో రాళ్లుగా మారే ద్రవాలు పేరుకుపోకుండా.. బయటకు పంపిస్తుందని వివరిస్తున్నారు.