తెలంగాణ

telangana

ETV Bharat / health

ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారా? - ఈ టిప్స్ పాటించారంటే ఇట్టే తగ్గిపోతాయి! - Fungal Infections Prevention Tips - FUNGAL INFECTIONS PREVENTION TIPS

Fungal Infections Prevention Tips : వర్షాకాలం మొదలైందంటే చాలు.. చాలా మందిని కొన్ని ఫంగల్ ఇన్​ఫెక్షన్స్ ఇబ్బంది పెడుతుంటాయి. ఇవి ఒకసారి అటాక్ అయ్యాయంటే ఓ పట్టాన వదిలిపోవు. ఈ సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు నిపుణులు.

Best Tips To Prevent Fungal Infections
Fungal Infections Prevention Tips (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 9, 2024, 6:53 PM IST

Best Tips To Prevent Fungal Infections :వేసవితాపంతో అల్లాడిన ప్రజలు వర్షాలు మొదలవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే వివిధ పనుల రీత్యా బయటకు వెళ్లినప్పుడు చాలా మంది వర్షంలో తడుస్తుంటారు. దాంతో వివిధ ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా వివిధ రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇబ్బందిపెడుతుంటాయి. అయితే, వీటిని నిర్లక్ష్యం చేస్తే కొన్ని ఫంగల్​ ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్ల వంటి జబ్బులకు దారితీసే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, వర్షాకాలంలో ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వెంటనే తగిన చికిత్స తీసుకోవడం మంచిది అంటున్నారు. అంతేకాదు.. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడే కొన్ని నేచురల్ టిప్స్ కూడా సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కొబ్బరి నూనె :కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లు నివారించడంలో కొబ్బరి నూనె చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొబ్బరి నూనె(Coconut Oil)ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని చెబుతున్నారు. దీనిలో ఉండే యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతాయంటున్నారు. ఇందుకోసం పాదాలలో ఇన్ఫెక్షన్ ఉంటే ముందుగా నీటితో కడుక్కొని అవి ఆరాక.. అలర్జీ ఉన్న చోట కోకోనట్ ఆయిల్​తో మసాజ్ చేసుకోవాలి.

అలోవెరా జెల్ :ఇది కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అలోవెరాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్ఫెక్షన్ల నివారణలో బాగా పనిచేస్తాయి. ఇందుకోసం.. కాస్త అలోవెరా జెల్​ తీసుకొని ఇన్ఫెక్షన్ సోకిన చోట అప్లై చేయాలి. కాసేపు అలాగే ఉంచి ఆపై గోరు వెచ్చని వాటర్​తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండు నుంచి మూడు సార్లు ఫాలో అయితే వర్షాకాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు.

2020లో "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ"లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. అలోవెరా జెల్ వర్షకాలంలో తలెత్తే వివిధ ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో సౌదీ అరేబియాలోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీకి చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ మహ్మద్ అల్-అబ్దుల్లా పాల్గొన్నారు. అలోవెరా జెల్​లోని యాంటీ ఫంగల్ లక్షణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

చర్మంపై దద్దుర్లు వేధిస్తున్నాయా? - ఈ రెమెడీస్​తో ఆల్ సెట్ !

పసుపు :దీనిలో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే.. పసుపును వివిధ రకాల వ్యాధుల నివారణలో ఉపయోగిస్తుంటారు. అలాగే, పసుపు వర్షాకాలంలో తలెత్తే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీసెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌, యాంటీఫంగల్‌ లక్షణాలు.. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో బాగా సహాయపడతాయంటున్నారు. పసుపును కొబ్బరినూనెతో కలిపి ఇన్ఫెక్షన్ ఉన్న చోట అప్లై చేసుకుంటే ఆ సమస్య నుంచి బిగ్ రిలీఫ్ పొందవచ్చంటున్నారు.

వెల్లుల్లి : ఫంగల్ ఇన్పెక్షన్లను దూరం చేయడంలో వెల్లుల్లి కూడా చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ మెక్రోబియల్ లక్షణాలు వాటి నివారణలో చాలా సహాయపడతాయంటున్నారు. ఇందుకోసం ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్​ లాగా చేసుకొని ఇన్ఫెక్షన్ ఉన్నచోట అప్లై చేయాలి. ఆపై 20 నుంచి 25 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని వాటర్​తో శుభ్రం చేసుకోవాలి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నైట్​ టైమ్ అధిక మూత్రవిసర్జన - అది షుగర్ లక్షణం మాత్రమే కాదు మరో ప్రమాదకరమైన జబ్బుకు సంకేతం!

ABOUT THE AUTHOR

...view details