తెలంగాణ

telangana

ETV Bharat / health

పండ్ల తొక్కలను పాడేస్తున్నారా? సూపర్​ టీని మిస్​ అయినట్లే!- రుచితో పాటు పోషకాలెన్నో! - Fruit Peel Tea - FRUIT PEEL TEA

How To Make Fruit Peel Tea : మీకు పండ్లంటే బాగా ఇష్టమా? ప్రతి రోజూ తప్పకుండా తింటారా? ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ పండ్ల తొక్కల సంగతేంటి? తీసి పడేస్తున్నారా? వాటితో టీ చేసుకోవచ్చు అని తెలుసా? పండ్ల తొక్కలతో ఎన్ని రకాల టీలు చేసుకోవచ్చు ఈ స్టోరీలో తెలుసుకుందాం

How To Make Fruit Peel Tea
How To Make Fruit Peel Tea (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 12:51 PM IST

How To Make Fruit Peel Tea: మామిడి, నారింజ వంటి జ్యూసీ పండ్లలో రుచితో పాటు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శక్తిని రెట్టింపు చేయడం, ఆర్ద్రీకరణ స్థాయిలను పెంచుతాయి. రోగనిరోధక వ్యవస్థను బలపరిచే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి ఎన్నో రకాల ఖనిజాలకు సహజ వనరులు పండ్లు. మరి వాటి తొక్కల సంగతేంటి? తీసి బయట పడేయడమే అనుకుంటున్నారా? పండ్ల తొక్కలే కదా అని అంత ఈజీగా తీసుకోకండి. వాటిని పడేసేముందు పండ్లలాగే అవి కూడా ఎన్నో రకాల పోషకాలను, బయెయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయని మర్చిపోకండి. మీ రోజును మరింత తాజాగా, సువాసరభరితమైన, రుచికరమైన టీలతో మొదలు పెట్టడానికి పండ్ల తొక్కలు మీకు ఉపయెగపడతాయని తెలుసుకోండి. పండ్ల తొక్కలతో టీ నా? అని ఆశ్చర్యపోకండి. నిజమే పండ్ల తొక్కలతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు రకాల టీలను తయారు చేసుకోవచ్చు.

సిట్రస్ పీల్ టీ
సిట్రస్ పండ్ల తొక్కలు టీ చేయడానికి చాలా బాగా పనికొస్తాయి. ముఖ్యంగా ఎండలు మండుతున్నప్పడు నారింజ, నిమ్మ, ద్రాక్ష పండ్ల తొక్కలతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల మీరు విటమిన్ సీని పొందుతారు. సిట్రస్ పండ్ల తొక్కలతో పాటు తేనె, దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులు కలిపి తయారు చేసుకుంటే మీరు మంచి రంగు, ఘాటైన రుచితో పాటు చక్కటి సువాసన కలిగిన టీని ఆస్వాదించవచ్చు.

ఆపిల్ పీల్ టీ
అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే ఆపిల్ పండ్లలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి తొక్కల్లో కూడా ఇవి మెండుగా లభిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. ఆపిల్ తొక్కలను ఉడకబెట్టి దాంట్లో కొంచెం నిమ్మరసం, తేనె కలిపి తాగితే రుచికి రుచి, పోషకాలకు పోషకాలను పొందవచ్చు.

పైనాపిల్ పీల్ టీ
వేరే పండ్ల తొక్కలేమో కానీ పైనాపిల్ తొక్కలు అస్సలు తినలేం. కానీ ఇవి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుందట. కడుపులో మంట వంటి సమస్యలు రాకుండా ఉంటాయట. పైనాపిల్ తొక్కలు, కొబ్బరి పాలు కలిగి టీ తయారు చేసుకుని తాగితే మళ్లీ మళ్లీ తాగాలని ఫీల్ అవడం ఖాయమట.

పీచ్ పీల్ టీ
జ్యూసీ జ్యూసీగా ఉండే పీచ్ పండును వేసవిలో ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తిగా తింటుంటారు. అలా అని వీటి తొక్కలేం తక్కువ చేయవు. పీచ్ పండు పైన ఉన్న తొక్కలను, తేనె, అల్లం కలిపి టీ తయారు చేసుకుని తాగితే ఆహా అనకుండా ఉండలేరు.

పుచ్చకాయ తొక్కల టీ
హైడ్రేటెడ్​గా ఉండేందుకు సహాయపడే పండ్లలో పుచ్చకాయ మొదటి వరుసలో ఉంటుంది. అయితే ఈ విషయంలో కేవలం పుచ్చకాయ లోపలి గుజ్జు మాత్రమే కాదు, బయటి తొక్కకూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పుచ్చకాయ తొక్కల టీలో కాస్తంత పుదీనా రెమ్మలు వేసుకుని సర్వ్ చేసుకున్నారంటే మామూలు టీని మర్చిపోవాలనుకుంటారట.

మామాడి తొక్క టీ
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు పండ్ల రాజు అయిన మామిడి పండు చాలా తాజాగా, రుచికరంగా ఉంటుంది. అందుకే వీటిని ఇష్టపడని వారంటూ ఉండనే ఉండరు. అయితే మామిడి పండ్లే కాదు తొక్కలు కూడా మీకు రుచికరమైన టీ తయారీకి ఉపయోగపడతాయట. మామిడి తొక్కలను మరిగించి వడకట్టి దాంట్లో చిటికెడు తేనె కలుపుకుని తాగితే మంచి అనుభూతిని పొందుతారు.

ఎక్కువ సేపు నిలబడటం వ్యాయామంతో సమానమా? డాక్టర్ల మాటేంటి? - Does Workout Equals To Standing

ఈ యోగాసనాలతో ముఖంపై కొవ్వు ఇట్టే కరిగిపోతుంది! ఓసారి ట్రై చేయండి!! - Yoga Asanas To Lose Face Fat

ABOUT THE AUTHOR

...view details