ETV Bharat / state

శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించా - వీడియో విడుదల చేసిన జగపతిబాబు - JAGAPATHIBABU ON SRITEJ FAMILY

రేవతి కుటుంబాన్ని ఇప్పటికే పరామర్శించానన్న జగపతి బాబు - సోషల్​ మీడియాలో సంబంధిత వీడియో పోస్ట్​

Jagapathibabu Post About Revathi Family
Jagapathibabu Post About Revathi Family (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2024, 7:49 PM IST

Updated : Dec 22, 2024, 9:37 PM IST

Jagapathibabu Post About Revathi Family : సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విధితమే. ఇప్పటికే ఆ బాధిత కుటుంబాన్ని తాను కలిసి పరామర్శించానని సినీ నటుడు జగపతిబాబు తెలిపారు.

సంధ్య థియేటర్‌ వద్ద చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాన్ని సినిమా వాళ్లు పరామర్శించట్లేదంటూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దానిపై సినీ నటుడు జగపతి బాబు తాజాగా స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఆయన వీడియో విడుదల చేశారు. సినిమా షూటింగ్‌ ముగించుకుని తాను ఊరి నుంచి రాగానే హాస్పిటల్​కు వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడి తండ్రిని, సోదరిని పలకరించాలని అనిపించి అక్కడకు వెళ్లానని జగపతి బాబు తెలిపారు. అందరి ఆశీస్సులతో బాలుడు త్వరగానే కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చానని తెలిపారు. అందరికంటే ఎక్కువగా ఎఫెక్ట్​ అయింది ఆ ఫ్యామిలీ అని, తన వంతుగా సపోర్ట్​ ఇవ్వాలనుకున్నానని వివరించారు. దానిని పబ్లిసిటీ చేయలేదని తెలిపారు. అందుకే ఎవరికీ ఈ విషయం తెలియదన్న జగపతిబాబు, దానిపై క్లారిటీ ఇవ్వడానికే ఈ పోస్టు అని వెల్లడించారు.

సంధ్య థియేటర్​ ఘటన : తాను హీరోగా నటించిన ‘పుష్ప 2 ప్రీమియర్‌ షోను చూసేందుకు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు హీరో అల్లు అర్జున్‌ వెళ్లిన సంగతి విధితమే. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడు. దానికి సంబంధించిన కేసులో అల్లు అర్జున్‌ ఇటీవల అరెస్టు అయి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు అర్జున్​ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అయితే, బాధిత కుటుంబాన్ని సినీ రంగానికి చెందిన వారు కలవలేదంటూ విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, ‘తల్లి చనిపోయి, 20 రోజులుగా తొమ్మిదేళ్ల పిల్లాడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా వెళ్లారా? అంటే వారేం ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. ఇది సిగ్గుపడాల్సిన విషయము' అని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అనడం గమనార్హం.

సంధ్య థియేటర్ ఘటన - లైవ్ వీడియో రిలీజ్ చేసిన సీపీ

'22 ఏళ్లు కష్టపడి సాధించుకున్న నమ్మకం, గౌరవం ఒక్క రాత్రిలో పోగొట్టారు' - బన్నీ కన్నీంటి పర్యంతం

Last Updated : Dec 22, 2024, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.