Foods To Eat In Each Decade Of Life :బతకడానికి ఆహారం తీసుకోవాలి కానీ, అందరి శరీర అవసరాలూ ఒకటి కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మహిళల పోషకాల అవసరాలు పురుషుల కంటే భిన్నంగా ఉంటాయి. ఏజ్‌ను బట్టీ మారిపోతుంటాయి. మరి ఏ దశలో ఎలాంటి తీసుకోవాలో చూద్దామా?
ఏ వయసులో ఏం తినాలంటే?
10-15 ఏళ్ల వయసులో : ఎదిగే ఆడపిల్లలకు ప్రొటీన్ ఎక్కువగా అవసరముంటుంది. కానీ, ఈ జనరేషన్ పిల్లలు ఇష్టపడే ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు అధికంగా ఉంటున్నాయి. ఫలితంగా ఎదుగుదల తగ్గి ఊబకాయం సమస్య బారిన పడుతుంటారు. దీనివల్ల హార్మోన్ల మార్పులు చిన్న వయసులోనే రుతుక్రమం ఆరంభం కావడం. ఇలా కా కూడదంటే వారికిచ్చే డైట్‌లో ఎగ్స్, ఆకు కూరలు, తాజాపండ్లు, ఆకుపచ్చని కూరగాయలతో పాటు నట్స్, వేరుశనగ, గోధుమలు, పెసలు వంటి పదార్థాలు ఉండేలా చూడండి. స్వీట్లు, కేకులు, చాక్లెట్లకు బదులు ఫ్రూట్ సలాడ్, నువ్వులు, డ్రైఫ్రూట్స్ లడ్డూలు వంటివి ఇస్తే మంచిది. స్నాక్స్ అంటే మొలకల చాట్, సెనగలు, బొబ్బర్లతో చేసిన వడలు లాంటివి రుచి చూపించండి. ఇవన్నీ రుచికరంగా ఉంటాయి. దేహానికి శక్తిని ఇస్తాయి.
15-30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు :టీనేజీ వయస్సు మొదలుకుని ముప్పైల వరకూ మహిళల జీవితంలో కీలకదశ. ఉన్నత చదువులూ, కెరియర్, వివాహం లాంటి లైఫ్‌లో ఎన్నో కీలక ఘట్టాలు జరిగేది ఇప్పుడే, ఈ హడావుడిలో పడి సరైన పోషకాహారం తీసుకోనివారు కొందరుంటే, బరువు పెరిగిపోతామనే భయంతో లెక్కలు వేసుకుని ఆహారాన్ని తినేవారు మరికొందరు. ఇలా చేయడం నెలసరి మీదే కాదు, పునరుత్పత్తి సామర్థ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
అందాన్ని కాపాడుకోవాలన్నా :ఆరోగ్యానికే కాదు అందాన్ని కాపాడు కోవాలన్నా తగిన పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. అందుకే అధిక కెలొరీలు ఉండే పప్పుధాన్యాలు, నట్స్, పండ్లు, ఫిష్, సోయాలను తగు మోతాదులో తీసుకోవాలి. తృణధాన్యాలు, లోఫ్యాట్ ప్రొడక్ట్స్, ఆకుపచ్చని కూరగాయలు తినాలి. రక్తహీనత రాకుండా పాలు, పౌల్ట్రీ, చేపలు, బచ్చ కూర, తోటకూర బీన్స్, కాయధాన్యాలు వంటి ఐరన్ పుష్కలంగా ఉండే వాటిని డైట్లో చేర్చుకోవాలి.