ETV Bharat / health

రాత్రిపూట సరిగా నిద్రపోవట్లేదా? - బరువు పెరగడంతో పాటు ఈ సమస్యల ముప్పు తప్పదట! - CAN POOR SLEEP CAUSE WEIGHT GAIN

ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గట్లేదా? - అందుకు నిద్రలేమి ప్రధానం కారణం కావొచ్చట!

Sleep Deprivation Can Cause Weight Gain
Sleep Deprivation (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2025, 10:31 AM IST

Updated : Jan 25, 2025, 10:38 AM IST

Sleep Deprivation Can Cause Weight Gain : చాలా మంది నిద్ర విషయంలో అజాగ్రత్తగా ఉంటుంటారు. ముఖ్యంగా నేటి టెక్నాలజీ యుగంలో ఫోన్లు, డిజిటల్‌ పరికరాల వాడకంతో నిద్ర సమయం చాలా వరకు తగ్గిందనే చెప్పొచ్చు. మరి, మీరు కూడా రోజూ నైట్ టైమ్ సరిగ్గా నిద్ర పోవట్లేదా? అయితే, అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే తగినంత నిద్ర పోని వ్యక్తులు, నిద్రలేమితో బాధపడేవారు బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉందట. పలు పరిశోధనల్లోనూ ఈ విషయం వెల్లడైంది. మరి, నిద్రలేమి బరువును ఎలా ప్రభావితం చేస్తుంది? సరైన నిద్రలేకపోతే తలెత్తే మరికొన్ని అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంలో మంచి నిద్ర కీలకమైన పాత్ర పోషిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. తక్కువ నిద్ర ఉంటే నెగిటివ్​గా, సరైన నిద్ర ఉంటే పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా సరైన నిద్ర లేకపోవడం శారీరక బరువు పెరుగుదలపై ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు. కాబట్టి, నేటి రోజుల్లో బరువు తగ్గాలనుకునేవారు ఫుడ్​ కంట్రోల్, వ్యాయామాలతో పాటు కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు.

బరువును ఎలా ప్రభావితం చేస్తుందంటే? తగినంత నిద్రలేకపోవడం వల్ల బాడీలో కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. ఇది బరువు పెరగడాన్ని బాగా ప్రోత్సాహిస్తుందంటున్నారు. ఎందుకంటే కార్టిసాల్​ను బరువును పెంచే ప్రధాన హార్మోన్​గా చెప్పుకుంటుంటారు. కార్టిసాల్ ఒక స్ట్రెస్ హార్మోన్​. మనం సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు అధికమవుతాయి. ఫలితంగా బాడీలో హర్మోన్ అసమతుల్యతలు ఏర్పడి బరువు పెరగడానికి దారితీస్తుందంటున్నారు. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్​ సభ్యుల బృందం జరిపిన ఓ రీసెర్చ్​లోనూ రోజూ తగినంత నిద్రపోకపోవడం బరువు పెరగడానికి దారితీస్తుందని వెల్లడైంది. డైలీ 7 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులలో ఊబకాయం ముప్పు ఎక్కువని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మెటబాలిజం తగ్గిపోతుంది! నిద్రలేమి మెటబాలిజం మీద ఎక్కువగా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సరైన నిద్ర లేకపోతే శరీరానికి కొవ్వు, కేలరీలను బర్న్ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. దాంతో తగ్గిన జీవక్రియ రేటు కారణంగా ఉదర భాగాన కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా బరువు పెరిగే ముప్పు ఎక్కువగా ఉంటుందంటున్నారు..

మానసిక ఆరోగ్యంపై ప్రభావం : శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం ఎంత ముఖ్యమో మానసికంగానూ ఆరోగ్యంగా ఉండటం అంతే అవసరం. తగినంత నిద్ర పోనివారు ఎప్పుడూ ఆందోళనతో, కంగారు పడుతూ ఉంటారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారట. అంతేకాదు, నిద్రలేమి కారణంగా అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి, ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే నిర్ణీత సమయానికి నిద్ర పోవడం చాలా అవసరమంటున్నారు. కచ్చితంగా రోజుకి 6 నుంచి 8 గంటల సమయాన్ని నిద్రకు కేటాయించాలి. మంచి నిద్రతోనే మంచి శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని గుర్తుంచుకోవాలంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Last Updated : Jan 25, 2025, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.