Children Left Orphaned by the Death of Their Mother : తల్లి కరోనాతో మరణించడం, చేరదీసి పెంచుతున్న నానమ్మను హత్య చేసి తండ్రి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ముధోల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా ఆష్ఠ గ్రామంలో లక్ష్మి, గజ్జారాం దంపతులకు ఇద్దరు పిల్లలు. తల్లి లక్ష్మి కరోనాతో గతంలోనే మరణించారు.
చేరదీసిన నానమ్మ : ఆ విషయం జీర్ణించుకోలేక తండ్రి గజ్జారాం మద్యానికి బానిసయ్యాడు. దీంతో చిన్నారుల పోషణ భారంగా మారడం, వారిని చూసుకునేవారు లేకపోవడంతో నాయనమ్మ హీరాబాయి వారిని చేరదీసింది. అన్నీ తానై పోషించింది. తనకు వచ్చే ఫించన్ డబ్బులతో వారి ఆలనాపాలనా చూసుకుంటూ జీవనం సాగించేది. మద్యానికి బానిసైన గజ్జారాం డబ్బుల కోసం తల్లి హీరాబాయిని తరచూ వేధించేవాడు. మద్యం తాగడానికి డబ్బులు కావాలని గొడవ పడేవాడు. అలా ఆ తల్లి మనుమరాలు, మనవడి పోషణ చూసుకుంటూ కుమారుడు గజ్జారాం వేధింపులు భరించేది.
ఆదుకోండయ్యా : ఏడాదిన్నర క్రితం తండ్రి - ఇటీవల తల్లి మృతి - అనాథలైన ఐదుగురు
శనివారం రాత్రి పిల్లలు, నాయనమ్మ తినేసి పడుకున్నారు. అర్ధ రాత్రి గజ్జారాం మద్యం మత్తులో అక్కడికి వచ్చి తల్లి హీరాబాయిని నిద్రలేపి మందు తాగడానికి డబ్బులు కావాలని గొడవకు దిగాడు. తల్లి తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా వినిపించుకోలేదు. పక్కన పిల్లలు ఉన్నారన్న విషయం పట్టించుకోలేదు. డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో తల్లిపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భయాందోళనకు గురైన పిల్లలు గట్టిగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వారికి విషయం చెప్పారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆరా తీసి గజ్జారాంను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గ్రామస్థులంతా కలిసి : హీరాబాయి అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో గ్రామంలో వారంతా ముందుకు వచ్చి తలా ఓ చేయి వేసి కార్యక్రమం పూర్తి చేశారు. చేరదీసిన నాయనమ్మ కూడా మరణించడంతో పిల్లలకు నా అనే వారు లేకుండా పోయారంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ముందుకు వచ్చి తన వంతుగా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. చిన్నారులకు ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని కోరారు. తల్లి, నాయనమ్మ మరణంతో రోడ్డున పడ్డ తమను ప్రభుత్వం ఆదుకోవాలని పిల్లలు వేడుకున్నారు.
దంపతులను బలి తీసుకున్న యువకుడి మద్యం మత్తు - అనాథలుగా మారిన ఆడపిల్లలు
చిన్నారులుక్షణికావేశంలో భార్య, భయంతో భర్త ఆత్మహత్య - అనాథలైన ఇద్దరు చిన్నారులు