Temperature in Babies :చిన్న పిల్లల శరీరం కాస్త వెచ్చబడగానే తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు! మరి.. నిజానికి ఎంత ఉష్ణోగ్రత దాటితే జ్వరంగా పరిగణించాలి? ఏ టెంపరేచర్ దాటితే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి? అనే ప్రశ్నలకు నిపుణుల సమాధానమేమిటో ఇప్పుడు చూద్దాం.
జ్వరం ఎందుకు వస్తుంది ?
సాధారణంగా రెండేళ్ల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లల్లో 100 డిగ్రీల వరకు సాధారణ ఉష్ణోగ్రతగానే పరిగణిస్తుంటారు. టెంపరేచర్ ఒకవేళ 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే శరీరంలో ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో.. జ్వరాన్ని ఒక వ్యాధిగా చూడకూడదని అంటున్నారు. ఎలాగైతే మన శరీరం నుంచి చెమట, నొప్పి వస్తుందో.. జ్వరం కూడా అలానే వస్తుందని చెబుతున్నారు. మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి ప్రతిస్పందిస్తుందని.. ఈ క్రమంలోనే మన బాడీ నుంచి నార్మల్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత విడుదలవుతుందని.. దీనినే జ్వరం అంటున్నామని వివరిస్తున్నారు.
ముద్దులొలికే చిన్నారులకు ముద్దు పెడుతున్నారా? - వారి ఆరోగ్యం డేంజర్లో పడ్డట్లే!
వేసవి కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది!
రెండేళ్లలోపు చిన్నారుల్లో జ్వరం రావడానికి రెండు కారణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒకటి ఇన్ఫెక్షన్.. రెండవది డీహైడ్రేషన్. సాధారణంగా చిన్నారులకు 8 నెలల వయసు ఉన్నప్పటి నుంచి ఘన పదార్థాలు ఇవ్వడం మొదలుపెడుతుంటారు. ఈ క్రమంలో వారు పాలు తక్కువగా తాగుతుంటారు. ఫలితంగా వారి బాడీలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌కు లోనయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సమ్మర్‌లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు.