తెలంగాణ

telangana

ETV Bharat / health

పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా? - ఉదయాన్నే​ ఈ డ్రింక్స్​ తాగితే వెన్నలా కరిగిపోద్ది!

Fat Burning Drinks: పొట్ట చుట్టూ కొవ్వుతో ఇబ్బందిపడుతున్నారా? కొవ్వు కరిగించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదా? అయినా నో వర్రీ. ఉదయం పూట ఈ డ్రింక్స్​ తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగడం గ్యారంటీ అంటున్నారు నిపుణులు. మరి ఆ డ్రింక్స్​ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

Fat Burning Drinks in Morning
Fat Burning Drinks in Morning

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 3:48 PM IST

Fat Burning Drinks in Morning: పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వుతో ఇబ్బంది పడేవారు.. ఉదయం లేవగానే కొన్ని డ్రింక్స్​ తాగాలని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ డ్రింక్స్​ ఏంటో ఇప్పుడు చూద్దాం.

గోరువెచ్చని నీరు, నిమ్మకాయ:జీవక్రియను వేగవంతం చేయడానికి, పొట్టు చుట్టూ ఉన్న కొవ్వు కరిగించడంలో ఈ డ్రింక్​ సాయపడుతుందని అంటున్నారు. ఈ డ్రింక్​ కోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఓ నిమ్మకాయను పిండి ఉదయాన్నే తాగాలని అంటున్నారు.

గ్రీన్​ టీ:గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకునే వారికి ఇదే బెస్ట్​ డ్రింక్​ అంటున్నారు.ఉదయం పూట ఖాళీ పొట్టతో తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని.. జీవక్రియ వేగాన్ని పెంచి కొవ్వును కరిగిస్తుందని అంటున్నారు. 2018లో అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. బరువు తగ్గడం, పొట్ట చుట్టూ కొవ్వు కరగడంలో గ్రీన్​ టీ సాయపడుతుందని పేర్కొన్నారు.

బాణపొట్ట ఎబ్బెట్టుగా ఉందా? ఉదయాన్నే ఇలా చేస్తే చాలు - ఐస్​లా కరిగిపోతుంది!

యాపిల్​ సైడర్​ వెనిగర్​: గోరువెచ్చని ఒక గ్లాసు నీటిలో రెండు నుంచి మూడు టీస్పూన్ల యాపిల్​ సైడర్​ వెనిగర్​ వేసి కొద్దిగా తేనె కలుపుకోవాలి. ఆ నీటిని ఉదయాన్నే ఖాళీ పొట్టతో తాగాలి. మీ పేగులను శుభ్రపరచడానికి ఈ డ్రింక్​ సహాయపడుతుంది. ఇది మీ pH స్థాయిని, మీ పొట్టలోని ఆమ్ల స్థితిని కూడా నిర్వహిస్తుంది. ఇది జీవక్రియ వేగాన్ని పెంచి కొవ్వు కరిగేలా చేస్తుంది.

జింజర్ వాటర్:ఓ చిన్న అల్లం ముక్కను తురిమి, గ్లాసు నీటిలో వేసి, రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపుతో ఈ నీటిని తాగాలి. 2018లో జర్నల్ ఆఫ్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం.. అల్లం నీరు బరువు తగ్గడం, పొట్ట చుట్టూ కొవ్వు కరగడంలో సాయపడుతుందని పేర్కొన్నారు.

గోల్డెన్ మిల్క్:బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఈ డ్రింక్​ ఎంతగానో ఉపయోగపడుతుంది. గోరువెచ్చని గ్లాసు పాలల్లో పసుపు, కొద్దిగా అల్లం, చిటికెడ్​ దాల్చినచెక్క పొడి వేసి తాగాలి.

పుదీనా, దోసకాయ నీరు:దోసకాయ ముక్కలు, తాజా పుదీనా ఆకులు నీటికి రుచి, ఆర్ద్రీకరణను జోడిస్తాయి. కొవ్వును కరిగించడంలో ఈ డ్రింక్​ చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

దాల్చినచెక్క, తేనె: తేనె, కొంచెం దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయాన్నే తీసుకోవడం ద్వారా బెల్లీ ఫ్యాట్​ను కరిగించడంలో సహాయపడటమే కాకుండా, షుగర్​ను కంట్రోల్లో ఉంచుతుంది.

నిమ్మ, అల్లం డ్రింక్:ఓ నిమ్మకాయ తీసుకొని దాని రసాన్ని ఓ గిన్నెలో పిండాలి. తాజా అల్లం ముక్క తీసుకొని, తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి, ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో మూడు కప్పుల నీరు పోసి ఓ పది నిమిషాలు మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి. ఈ డ్రింక్​ తాగడం వల్ల కొవ్వు ఈజీగా కరుగుతుంది.

పెళ్లి తర్వాత బరువు పెరిగారా? - ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ ఫిగర్ పక్కా!

ఈజీగా బరువు తగ్గాలా? తిన్న తర్వాత నీరు ఇలా తాగి చూడండి!

Belly Fat Burning Floor Exercises : జిమ్​కు వెళ్లకుండానే పొట్ట తగ్గాలా?.. ఈ ఫ్లోర్​ ఎక్స్​ర్​సైజ్​లు​ ట్రై​ చేయండి!

ABOUT THE AUTHOR

...view details