తెలంగాణ

telangana

ETV Bharat / health

ఇంట్లోని వారంతా స్నానానికి ఒకే సబ్బు వాడుతున్నారా? - Everyone Share SameSoap in Family

What Happens if Share Soap in Family? : స్నానం చేయడానికీ.. లేదా హ్యాండ్ వాష్ చేసుకోవడానికీ.. ఇంట్లోని వారంతా ఒకే సబ్బు వాడుతుంటారా? అయితే మీరు అలర్ట్ అవ్వాల్సిందే. లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఎందుకో మీరే చూడండి.

What Happens if Share Soap in Family
What Happens if Share Soap in Family

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 3:13 PM IST

What Happens if Share Soap in Family? :మనం ప్రతిరోజూ శరీరంపై పేరుకుపోయే క్రిములను వదిలించుకునేందుకు స్నానం చేస్తుంటాం. అయితే.. చాలా మంది ఇళ్లలో స్నానానికి కుటుంబ సభ్యులందరూ ఒకే సోప్​ వాడుతుంటారు. మీ ఇంట్లో కూడా ఇదే విధంగా యూజ్ చేస్తున్నట్లయితే మీరు అలర్ట్ అవ్వాల్సిందే అంటున్నారు నిపుణులు. లేదంటే.. మీ అంతట మీరే కొన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం ఖాయమంటున్నారు.

Used Soap Side Effects:చిన్న లాజిక్ ఏమంటే.. సబ్బులు మన చర్మాన్ని(Skin) శుభ్రంగా ఉంచుతాయి కానీ, వాటిని అవి శుభ్రం చేసుకోలేవు. మనం సబ్బుతో స్నానం చేసినప్పుడు శరీరంపై ఉన్న సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా సబ్బుపైకి చేరి దానిపై పేరుకుపోయే అవకాశం ఉంటుంది. పలు అధ్యయనాలు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. నిజానికి సబ్బు అనేది ఒక క్లెన్సింగ్ ఏజెంట్ కాబట్టి.. అది కలుషితం కాదు లేదా జెర్మ్స్ కలిగి ఉండదని మనం అనుకుంటాం. కానీ, 2006లో ఇండియన్ జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. కొన్ని వాడిన సబ్బులను పరీక్షించినప్పుడు వాటిపై వివిధ రకాల సూక్ష్మజీవులను గుర్తించారు.

సబ్బుపై ఉండే సూక్ష్మక్రిముల్లో షిగెల్లా, ఈ కోలి, సాల్మోనెల్లా లాంటి ప్రమాదకర బ్యాక్టీరియాతోపాటు స్టాఫ్, రోటా, నోరో వంటి వైరస్‌లు కూడా ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. కాబట్టి ఒకరు వాడిన సబ్బులు మరొకరు వాడినప్పుడు వాటి మీద పేరుకుపోయిన క్రీములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి ఏవైనా గాయాలైనప్పుడు ఒకరు వాడిన సబ్బుతో ఆ గాయాలను కడిగినప్పుడు ఈ జెర్మ్స్ ఒకరి నుంచి మరొకరి వ్యాపించే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

డైలీ ఈ పొరపాట్లు చేస్తున్నారా? - అయితే మీ చర్మం దెబ్బతినడం ఖాయం!

అయితే.. కొన్ని అధ్యయనాలు మాత్రం సబ్బుపై సూక్ష్మజీవులు ఉన్నప్పటికీ.. అవి సాధారణంగా వ్యాధులను కలిగించవని, వాడిన సబ్బులతో చేతులు చాలాసార్లు కడుక్కున్నప్పటికీ బ్యాక్టీరియా లేదా వైరస్​లు ట్రాన్స్​ఫర్ కాలేదని చెబుతున్నాయి. అందువల్ల ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం చాలా తక్కువగా ఉందని నిపుణులు అంచనా వేశారు. కాకపోతే.. మెథిసిలిన్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్(MRSA) కారణంగా సంభవించే యాంటీబయాటిక్-రెసిస్టెంట్ ఇన్‌ఫెక్షన్ సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందంటున్నారు. మొత్తంగా చూసుకున్నప్పుడు.. సబ్బులు, టవల్స్ వంటి వ్యక్తిగత వస్తువులను షేర్ చేసుకోవడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

ఒకవేళ మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒకే సబ్బు వాడుతున్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. అవేంటంటే.. సబ్బుని వాడిన తరువాత దానిని శుభ్రంగా నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. అవసరమైతే ఇరవై నుంచి ముప్పై సెకన్లపాటు నురగవచ్చేలా కడగడం బెటర్. అలాగే సబ్బుని గాలి తగిలేలా ఉంచాలి. మీరు సబ్బు పెట్టె యూజ్ చేస్తున్నట్లయితే.. అందులో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అవకాశం ఉంటే సబ్బుకి బదులుగా లిక్విడ్ హ్యాండ్ సోప్, లిక్విడ్ బాడీ వాష్ వాడటం ఉత్తమం అని సూచిస్తున్నారు.

అర‌టి తొక్కే అని తేలిగ్గా పారేయ‌కండి- ఇలా వాడితే మెరిసే చ‌ర్మం మీ సొంతం!

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఈ ఆయిల్స్​ ట్రై చేసే మెరుపు గ్యారంటీ!

ABOUT THE AUTHOR

...view details