తెలంగాణ

telangana

ETV Bharat / health

మీ పిల్లలు చిప్స్ ఎక్కువగా తింటున్నారా? - ఇలా చేశారంటే ఈజీగా మానేస్తారట!

పిల్లలు ఎక్కువగా తినే చిరుతిళ్లలో ఒకటి.. చిప్స్. అయితే, వాటిని తరచూ తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. చిన్నప్పుడే ఆ అలవాటు మాన్పించాలని సూచిస్తున్నారు. అందుకు ఏం చేయాలో తెలుసా?

HOW TO STOP HABIT OF EATING CHIPS
How to Wean Children Chips Eating (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Oct 9, 2024, 6:02 PM IST

How to Wean Children Chips Eating :చిప్స్.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోరూరిపోతుంది. ఇక పిల్లలకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో తయారు చేసిన ఆహారం కన్నా చిప్స్​నే ఎక్కువగా తింటుంటారు. అయితే, ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు కానీ.. తరుచుగా తింటుంటే మాత్రం వెంటనే ఆ అలవాటును మాన్పించడం మంచిదంటున్నారు ప్రముఖ న్యూటిషనిస్ట్ డాక్టర్ జానకీ శ్రీనాథ్. ఎందుకంటే.. చిప్స్(Chips)తరచూ తినడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు. ఇంతకీ.. చిప్స్ తినడం పిల్లల ఆరోగ్యాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది? ఈ అలవాటును మాన్పించాలంటే ఏం చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సాధారణంగా చిప్స్‌లో రెండు రకాలుంటాయి. వాటిలో ఒకటి..బంగాళాదుంప(Aloo), అరటి వంటి వాటితో చేసేవి కాగా, మరొకటి.. పిండితో ప్రిపేర్ చేసుకునేవి ఉంటాయి. ఇందులో వేటినైనా ఆయిల్​లో ఎక్కువగా వేయిస్తారు. ఇందులో ఇంట్లో చేసినవయితే కాస్త పర్వాలేదు. కానీ.. అదే బయట దొరికే స్నాక్స్‌లో రకరకాల మసాలాలు, కారప్పొడులు, ఉప్పు వంటివి ఎక్కువగా కలిపి చిప్స్​ని ప్రిపేర్ చేస్తుంటారు. వీటివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

కంటి చూపు కోల్పోవచ్చు! : పిల్లలు చిప్స్ తింటే చాలు.. వాళ్ల పొట్ట వెంటనే నిండిపోతుంది. దీంతో వేరే ఆహారం తినాలనిపించదు. అయితే.. మీ పిల్లలూ చిప్స్ ఎక్కువగా తింటున్నట్టయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్. అవేంటంటే.. చిప్స్‌లో కెలోరీలు అధికంగా ఉంటాయి. అలాగే.. వీటి ద్వారా శరీర పనితీరుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందవు. దాని కారణంగా.. ఐరన్‌, జింక్‌, విటమిన్‌-ఎ, సి లోపాలు తలెత్తే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అంతేకాదు.. త్వరగా అలసిపోవడం, ఏదైనా అనారోగ్యం వస్తే తొందరగా నయం కాకపోవడం, చివరకు కంటిచూపును(Eyesight)కోల్పోయే పరిస్థితి కూడా పిల్లల్లో రావొచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. మీ పిల్లలు చిప్స్ ఎక్కువగా తింటున్నట్లయితే ఇప్పుడే ఈ అలవాటును మాన్పించాలని సూచిస్తున్నారు.

చిప్స్ తినే అలవాటును ఎలా మాన్పించాలంటే?

  • పిల్లలు ఒక్కసారిగా చిప్స్ తినడాన్ని మానుకోలేరు. కాబట్టి.. నెమ్మదిగా వారితో మానిపించే ప్రయత్నం చేయాలంటున్నారు.
  • అందుకోసం వారం పదిరోజులకోసారి చిప్స్ ఇస్తూ.. అవి అతిగా తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి వారికి అర్థమయ్యేలా చెబుతుండాలి.
  • అదేవిధంగా.. పిల్లల రోజువారీ భోజనంలో నూనె, పప్పు గింజలు, తృణధాన్యాలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, అన్ని రంగుల పండ్లూ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
  • ఇలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవాటైతే.. వాళ్లే క్రమంగా చిప్స్‌ అడగడం మానేస్తారని సూచిస్తున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

బిగ్ అలర్ట్ : మీకు ఈ చిప్స్ తినే అలవాటు ఉందా? - మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసుకోండి!

చిప్స్ ప్యాకెట్లలో సగానికిపైగా గాలితోనే నింపుతారు! - ఎందుకో మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details