Uses For Lemon In Kitchen :నిమ్మకాయలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మనందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది నిమ్మకాయలను ఎక్కువగా కొంటుంటారు. అయితే, నిమ్మకాయలను ఎక్కువ కాలం వాడకపోతే ఎండిపోతుంటాయి. ఇలా ఎండిపోయిన వాటిని పనికి రావని అందరూ డస్ట్‌బిన్‌లో పడేస్తుంటారు. మీరు కూడా ఇలానే ఎండిపోయిన నిమ్మకాయలను పారేస్తున్నారా ? అయితే, ఈ స్టోరీ తప్పక చదవండి. ఎండిన నిమ్మకాయలో ఉండే కొన్ని గుణాలు క్లీనింగ్ ఏజెంట్‌గా, క్రిమి సంహారిణిగా పనిచేస్తాయని నిపుణులంటున్నారు. మరి, ఈ నిమ్మకాయలను దేనికోసం వాడచ్చు? తెలుసుకుందాం రండి..
ఇలా చేస్తే శుభ్రం :రోజూ మనం కిచెన్‌లో కూరగాయలు కట్ చేయడానికి చాపింగ్ బోర్డు వాడుతుంటాం. అయితే, దీనిని శుభ్రం చేయడానికి ఒక ఎండిన నిమ్మకాయను తీసుకుని కట్ చేసి చాపింగ్ బోర్డుపైన రుద్దండి. తర్వాత వాటర్‌తో క్లీన్ చేయండి. ఇలా చేయడం ద్వారా బ్యాక్టీరియా చనిపోవడంతో పాటు, దుర్వాసన పోతుందని నిపుణులంటున్నారు.
2022లో "Food Control" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. చాపింగ్ బోర్డుల నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించడంలో నిమ్మరసం సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీలో ఆహార విజ్ఞానం, టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ John G. Fadel పాల్గొన్నారు. చాపింగ్ బోర్డులను శుభ్రం చేయడానికి ఎండిన నిమ్మకాయలు బాగా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే దుర్వాసన వస్తోందా ? ఈ టిప్స్ పాటిస్తే క్లీన్ అండ్ ఫ్రెష్ పక్కా!
దుస్తులపై మరకలు :కొన్ని సార్లు మనకు ఎంతో ఇష్టమైన దుస్తులపై టీ, కాఫీ, కూర మరకలు పడుతుంటాయి. ఈ మరకలు పోవడానికి ముందుగా కట్ చేసిన నిమ్మకాయను తీసుకుని దుస్తులపై మరకలున్నచోట రుద్దండి. తర్వాత నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. దుస్తులపై మరకలు మొత్తం పోతాయి.