Does Swimming Control Blood Sugar : నేటి కాలంలో వయసు, జెండర్‌తో సంబంధం లేకుండా సమస్త మానవాళిని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య డయాబెటిస్! ఇది ఒక్కసారి ఎటాక్ అయ్యిందంటే.. జీవితాంతం తొలగిపోదు. జీవితం మొత్తం పూర్తిగా మారిపోతుంది. కఠినమైన ఆహార నియమాలు ఫాలో అవ్వాలి. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోవడానికి డైలీ ఎన్నో మందులు వాడాలి. అంతే కాకుండా పలు శారీరక వ్యాయామాలు కూడా చేయాలి. అయితే..షుగర్ వ్యాధిగ్రస్థులు స్విమ్మింగ్ చేయడం మంచిదేనా? స్విమ్ చేస్తే లాభమా? నష్టమా? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. మరి దీనికి నిపుణులు ఆన్సర్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
డయాబెటిస్ ఉన్నవారు హ్యాపీగా స్విమ్ చేయొచ్చని నిపుణులు అంటున్నారు. రోజూ ఈత కొడితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని చెబుతున్నారు. 2018లో "Diabetes Care" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. వారానికి 150 నిమిషాలు ఈత కొట్టిన వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనా షాంఘైలోని జియా టంగ్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రొఫెసర్ డాక్టర్ షైన్ షి పాల్గొన్నారు.
అలర్ట్: ఎగ్స్ తింటే షుగర్ వస్తుందా? - పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు! - Eating too Many Eggs Cause Diabetes
ఈత కొట్టడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉండటమే కాకుండా.. అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. అవేంటంటే..
- ఈత కొట్టడం ఒక కార్డియో వ్యాయామం. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
- ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయనాళ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.
- హైబీపీని కూడా ఈత అదుపులో ఉంచుతుందని.. కాబట్టి హైబీపీ ఉన్నవారు ప్రతిరోజూ ఈత కొట్టాలని సూచిస్తున్నారు.
- ఈత కొట్టడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయని.. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. గంట పాటు ఈత కొట్టడం వల్ల సుమారు 700 కేలరీలు కరిగిపోతాయని అంటున్నారు.
- స్విమ్మింగ్ కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుందని, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉపశమనం ఇస్తుందని పేర్కొన్నారు.
- ఈత కొట్టడం ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఈత కొట్టేటప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు మెదడును ఉత్తేజపరచడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయని అంటున్నారు.
- స్విమ్ చేయడం శరీరాన్ని అలసిపోయేలా చేస్తుందని.. ఇది మెరుగైన నిద్రకు దారితీస్తుందని అంటున్నారు.
- ఈత కొట్టడం శరీరంలోని తెల్ల రక్త కణాలను పెంచుతుందని.. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయని అంటున్నారు నిపుణులు.
- ఈత కొట్టడం మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుందని.. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అంటున్నారు.
- అయితే ఆస్తమా ఉన్నవారు ఈత కొట్టేముందు ఒకసారి వైద్యులను సంప్రదించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : నోట్లో ఈ సమస్యలుంటే - షుగర్ ముప్పు ఉన్నట్టే! - Diabetes Warning Signs
మీకు షుగర్ ఉందా? - అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి అస్సలు తినకూడదు! - Sugar Patients Avoid Breakfast Food