తెలంగాణ

telangana

ETV Bharat / health

నెయ్యి తింటే - అనారోగ్యకరమైన బరువు పెరుగుతారా? - Eating Ghee Increase Fat in telugu

Does Eating Ghee Increase Fat : నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలా మంది అంటారు. ఊబకాయం కూడా వస్తుందని భావిస్తుంటారు. అందుకే.. డైటింగ్‌ చేసే వారు నెయ్యి తినడానికి వెనకడుగు వేస్తారు. మరి.. ఇందులో నిజమెంత? నెయ్యి తింటే నిజంగానే బరువు పెరుగుతారా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Does Eating Ghee Increase Fat
Does Eating Ghee Increase Fat

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 12:43 PM IST

Does Eating Ghee Increase Fat : కొన్నేళ్లు వెనక్కి వెళితే.. పూర్ణం బూరె నుంచి మొదలుకుని రసం అన్నం వరకూ కమ్మని ఆ నేతి వాసన లేనిదే చాలా మందికి ముద్ద దిగేది కాదు. కానీ.. ఇప్పుడు కాలం మారింది. మెజారిటీ జనం నెయ్యి తినట్లేదు. నెయ్యి తింటే లావు అయిపోతామనే ఆలోచనతో చాలా మంది ముట్టుకోవట్లేదు. అయితే నిజంగానే నెయ్యి తింటే బరువుపెరుగుతారా? అనే విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

పోషకాలెన్నో :
నెయ్యిలో చాలా రకాల పోషకాలుంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయని నిపుణులంటున్నారు. అలాగే ఇందులోని కొవ్వులో విటమిన్ ఎ, ఇ, డి, కె ఉంటాయి. ఇంకా ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ ఆమ్లాలు, లినోలిక్, బ్యుటిరిక్ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గిస్తాయట. అలాగే రోజూ ఆహారంలో నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరంలోని నరాల పనితీరు మెరుగుపడుతుందని అంటున్నారు.

ఎముకలను బలంగా చేస్తుంది :
నెయ్యిలో విటమిన్‌ కె, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలోని ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయం చేస్తాయని అంటున్నారు.

సులభంగా జీర్ణం:
జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా నెయ్యి ఎంతగానో సహాయపడుతుందట. ఇది ఆహారం సులభంగా అరగడానికి దోహదపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

అందానికీ :
నెయ్యి కేవలం ఆరోగ్యానికే కాదు అందానికీ మేలు చేస్తుందని నిపుణులంటున్నారు. ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుందట. ముఖ్యంగా చాలా మందికి చలికాలంలో పెదాలు పగిలి, కొన్ని సందర్భాల్లో రక్తం కూడా వస్తుంటుంది. ఈ సమస్యతో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు కొద్దిగా నెయ్యిని తీసుకుని పెదాలపై అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. అలాగే పెదాలు మృదువుగా మారుతాయని అంటున్నారు.

ఎముకలు దృఢంగా :

నెయ్యి తినడం ద్వారా ఎముకలు దృఢంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎముక మజ్జ బలంగా మారుతుందని.. శరీరంలోని బోన్స్ అన్నీ హెల్దీగా ఉంటాయని అంటున్నారు.

అతి వద్దు..
అయితే.. ఆహార పదార్థాలు ఏవైనా అతిగా తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఇది నెయ్యికి కూడా వర్తిస్తుందని నిపుణులంటున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు స్వచ్ఛమైన నెయ్యిని రెండు టీస్పూన్లు తీసుకుంటే ఎలాంటి సమస్యలూ రావని చెబుతున్నారు. అలాగే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని తెలియజేస్తున్నారు. అతిగా తింటే కాస్త బరువు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నెయ్యిని తక్కువగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఎక్కువగా తీసుకోవాలంటే.. డాక్టర్ సలహా మేరకు ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. అదే సమయంలో.. మార్కెట్లో ఎక్కువగా కల్తీ నెయ్యి లభిస్తుంది. అందువల్ల స్వచ్ఛమైన నెయ్యిని తినాలని సూచిస్తున్నారు.

దుకాణాల్లో దొరికే తిండి - ఎందులో ఉప్పు ఎక్కువగా ఉంటుందో తెలుసా?

అవిసె గింజెలు తినట్లేదా? - ఎన్ని ప్రయోజనాలు కోల్పోతున్నారో తెలుసా?

కండలు పెంచుకోవాలా? - అయితే ఈ ఫుడ్స్ మీ డైట్‌లో ఉండాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details