తెలంగాణ

telangana

ETV Bharat / health

మీకు కంటి సమస్యలున్నాయా? - అది గ్లకోమానా? లేదా క్యాటరాక్టా?

Glaucoma and Cataract Differences : ఈరోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే ఎక్కువగా కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా గ్లకోమా, క్యాటరాక్ట్​ అనే సమస్యలను ఎంత వేగంగా గుర్తిస్తే అంత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే శాశ్వత అంధత్వానికి దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక వీటిని అలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం..

Cataract
Glaucoma

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 4:02 PM IST

Difference Between Glaucoma and Cataract : సాధారణంగా ఒకప్పుడు 50 ఏళ్లు దాటినవారిలో కంటి సమస్యలు ఎక్కువగా కనిపించేవి. కానీ, ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది గ్లకోమా, క్యాటరాక్ట్​(కంటి శుక్లం) వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవి రెండూ తీవ్రమైన కంటి ఇన్ఫెక్షన్లు. సరైన టైమ్​లో చికిత్స తీసుకోకపోతే పూర్తి అంధత్వానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఇవి రెండూ ఒకేలా కనిపించినా వీటి మధ్య కొన్ని ప్రధాన తేడాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని త్వరగా గుర్తించి ట్రీట్​మెంట్ తీసుకుంటే కంటి(Eye)ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గ్లకోమా :ఇది కంటి జబ్బుల్లో ప్రమాదకరమైనది. దీని లక్షణాలు బయటకు కనిపించవు. చాలా మందికి ఇది ముదిరిపోయిన తర్వాతే బయట పడుతుంది. అప్పటికే చూపు చాలా తగ్గిపోతుంది. నిశ్శబ్దంగా కంటిచూపును కబళించి శాశ్వత అంధత్వాన్ని తెచ్చే గ్లకోమాను త్వరగా గుర్తించడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ ఆఫ్ ది ఐ, సైలెంట్ థీఫ్ అని పిలుస్తారు. ఇది కంటిశుక్లం కంటే భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా గ్లకోమా ఆప్టిక్ నాడిని దెబ్బతీస్తుంది.

కారణాలు :అధిక రక్తపోటు, ధూమపానం, కెఫిన్, కంటి కోణానికి నష్టం, కంటికి గాయం, వయస్సు లేదా వంశపారంపర్యంగా కూడా గ్లకోమా వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.

లక్షణాలు : దీని లక్షణాలు త్వరగా బయటకు కనిపించవు. మొదట కంటిలో గుడ్డి మచ్చలు ఏర్పడి క్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఇవి పరిధీయ దృష్టిని దెబ్బతీస్తాయి. అలాగే అధిక కంటి పీడనం ఉన్న కొద్దిమందికి ఉదయం తలనొప్పి లేదా చూపు మందగించవచ్చు. ఇక ఇది తీవ్రమైనప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

  • తీవ్రమైన కంటి నొప్పి
  • కళ్ళు ఎర్రబడటం
  • అస్పష్టమైన దృష్టి
  • తలనొప్పి
  • వికారం
  • వాంతులువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.

చికిత్స : దీనిని ఎంత త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే కంటిచూపు అంత మెరుగ్గా ఉంటుందంటున్నారు నిపుణులు. శస్త్ర చికిత్స చేయించుకోవాలి. లేదంటే శాశ్వత దృష్టి కోల్పోవడానికి దారితీస్తుంది. కాబట్టి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సంవత్సరానికి ఒకసారి రొటీన్ ఐ చెకప్ చేయించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

ఎవరికి గ్లకోమా వచ్చే ప్రమాదం ఉంది?

40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి గ్లకోమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందులోనూ గ్లకోమా కుటుంబ చరిత్ర, అధిక కంటి పీడనం, రక్తపోటు, స్టెరాయిడ్స్ తీసుకునే వ్యక్తులు, కంటి గాయం, మధుమేహం, మైగ్రేన్, బలహీనమైన రక్త ప్రసరణ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు, మయోపియా లేదా హైపర్‌మెట్రోపియా వంటి వాటితో బాధపడేవారికి ఇది వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు.

మీ చుట్టూ కంటి చూపు పోగొట్టే శత్రువులే! - ఈ టిప్స్ పాటించకుంటే అంతే!

క్యాటరాక్ట్(కంటి శుక్లం) :అంధత్వానికి దారితీసే వాటిలో కంటిశుక్లం కూడా ఒకటి. ఇది ముఖ్యంగా కంటి లెన్స్‌ను ప్రభావితం చేస్తుంది. కాకపోతే దీన్ని త్వరగా గుర్తించి సాధారణ శస్త్ర చికిత్స విధానాలతో నివారించవచ్చని నేత్ర వైద్యులు చెబుతున్నారు. ఇక కారణాలు, లక్షణాల విషయానికొస్తే..

కారణాలు :

  • గ్లకోమా
  • మధుమేహం
  • మూత్రపిండాల వ్యాధి
  • కంటి గాయాలు
  • ధూమపానం
  • కంటి లోపల మంట
  • కొన్ని రకాల ఔషధాలు
  • కంటికి సోకే ఇన్‌ఫెక్షన్లు.

లక్షణాలు :

  • ఒక వస్తువు రెండుగా కన్పించడం
  • డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఇబ్బంది
  • కంటి గుడ్డులో మబ్బుగా కన్పించడం
  • అస్పష్టమైన దృష్టి
  • రాత్రిపూట బలహీనమైన చూపు
  • మసక వెలుతురులో చదవలేకపోవడం
  • కంటిలో తెల్లగా కన్పించడం
  • కనుబొమ్మల అసంకల్పిత వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చికిత్స :దీనిని త్వరగా గుర్తించి ట్రీట్​మెంట్ తీసుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో దృష్టిని పునరుద్ధరించే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ, కొన్నిసార్లు శుక్లం ముదిరిపోతే శస్త్ర చికిత్స కష్టతరంగా మారుతుందంటున్నారు. ఒక్కోసారి శస్త్ర చికిత్స అనంతరం ఇన్‌ఫెక్షన్లకు దారి తీసే ప్రమాదం లేకపోలేదంటున్నారు. కాబట్టి తొలి దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

We care about eye care : మీ కళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని అనుకుంటున్నారా..!

ABOUT THE AUTHOR

...view details