Side Effects of Drinking Cold Water in Summer : రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటక ముందే నడినెత్తున సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఈ క్రమంలో చాలా మంది ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి చల్లటి ఆహారాలు, పానీయాలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా వేసవి తాపం నుంచి రిలీఫ్ పొందడానికి మెజార్టీ జనం ఫ్రిడ్జ్‌లోని నీళ్లను తాగుతుంటారు. అయితే, అలా తీసుకోవడం అప్పటివరకు తక్షణ ఉపశమనాన్ని అందించిన.. తర్వాతర్వాత ఈ పద్ధతి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి సమ్మర్లో కూల్ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీర్ణక్రియ నెమ్మదిస్తుంది :సమ్మర్లో చల్లని నీరు తాగడం జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా భోజనానికి ముందు కూల్ వాటర్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుందంటున్నారు. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రబుల్, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.
2019లో జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. సమ్మర్లో చల్లని నీరు తాగడం జీర్ణక్రియను నెమ్మదించే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన గాస్ట్రోఎంటరాలజిస్ట్, ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్. లియోనార్డో పాల్గొన్నారు. సమ్మర్లో ఎక్కువగా కూల్ వాటర్ తాగితే జీర్ణ ఎంజైమ్‌ల పనితీరు తగ్గి అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీయవచ్చని ఆయన పేర్కొన్నారు.
దంతాల ఆరోగ్యంపై ప్రభావం : వేసవిలో చాలా కూల్‌గా ఉండే వాటర్ తాగడం దంత ఆరోగ్యానికి హానికరమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే చల్లని నీటి ఉష్ణోగ్రతలు దంతాల సున్నితత్వాన్ని పెంచే అవకాశం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా దంతాలపై ఉండే ఎనామిల్‌ను ప్రభావితం చేసి పళ్లను మరింత సున్నితంగా మార్చవచ్చంటున్నారు నిపుణులు.
శ్వాసకోశ సమస్యలు వస్తాయి :సమ్మర్లో ఎక్కువగా చల్లని నీటిని తాగడం శ్వాసకోశ వ్యవస్థలో శ్లేష్మ ఉత్పత్తిని ప్రేరేపిస్తుందంటున్నారు నిపుణులు. ఫలితంగా మీ గొంతులో శ్లేష్మం పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా జలుబు, ఫ్లూ లేదా అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా అలర్జీలు లేదా శ్వాసకోశ సమస్యలకు గురయ్యే వ్యక్తులలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చంటున్నారు నిపుణులు.
మీకు కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత - కొబ్బరి తినే అలవాటు ఉందా? - ఏం జరుగుతుందో తెలుసా!