తెలంగాణ

telangana

ETV Bharat / health

తుప్పు, జిడ్డు మరకలతో ట్యాప్స్​ అసహ్యంగా ఉన్నాయా? - ఇలా చేస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయి! - Cleaning Tips

Tap Cleaning Tips : రోజూ ఉపయోగించే కొద్దీ.. కిచెన్‌లోని స్టెయిన్​ లెస్‌ స్టీల్‌ ట్యాప్‌లు, సింక్‌ తుప్పు పడుతుంటాయి. ఇంకా.. సబ్బు, జిడ్డు మరకలు పేరుకుపోతుంటాయి. వీటిని ఎంత క్లీన్‌ చేసినా కూడా తొలగిపోవు! అయితే.. కొన్ని చిట్కాలు పాటిస్తే వీటిని తళతళా మెరిసేలా చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 11:40 AM IST

Cleaning Tips
Tap Cleaning Tips (ETV Bharat)

Cleaning Tips For Kitchen :ప్రస్తుత కాలంలో చాలామంది కిచెన్‌లో, అలాగే బాత్‌రూమ్‌లలో స్టెయిల్‌లెస్‌ స్టీల్‌ ట్యాప్స్‌ను ఎక్కువగా బిగించుకుంటున్నారు. అయితే.. రోజూ ఉపయోగించే కొద్దీ సబ్బు, జిడ్డు మరకలు అంటుకుంటాయి. వీటిని వదిలించడానికి కొంతమంది ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. కానీ.. ఆ మొండి మరకలుఅంత ఈజీగా తొలగిపోవు. అయితే.. కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల ట్యాప్స్​ను కొత్తవాటిలా మెరిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో చూసేద్దామా..!

నిమ్మరసం :
ఒక గిన్నెలో కొద్దిగా సర్ఫ్‌ తీసుకుని అందులో నిమ్మరసం వేయండి. ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. తర్వాత జిడ్డుమరకలున్న ట్యాప్‌పైన మిశ్రమాన్ని చల్లి స్క్రబర్‌తో రుద్దండి. ఒక 5 నిమిషాల తర్వాత కడిగేయండి. అంతే ఇలా ఈజీగా ట్యాప్‌పైన ఉన్న మొండి మరకలను తొలగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

టూత్ పేస్ట్ :
మనం బ్రష్‌ చేయడానికి ఉపయోగించే.. టూత్‌పేస్ట్‌తో ట్యాప్‌లను క్లీన్‌ చేయొచ్చని మీకు తెలుసా? అది ఎలా అంటే? ముందుగా ఒక పాత బ్రష్‌పై కొద్దిగా పేస్ట్‌ అప్లై చేసి మురికిగా ఉన్న ట్యాప్‌లను బాగా రుద్దాలి. ఒక 5 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. ట్యాప్‌లపైన ఉన్న మురికి మొత్తం పోతుంది.

బాత్‌రూమ్‌లో మరకలు ఎన్నిసార్లు కడిగినా పోవట్లేదా? - ఈ టిప్స్‌ పాటిస్తే సరి!

వెనిగర్ :
ఒక గిన్నెలో కొద్దిగా వైట్‌ వెనిగర్‌ తీసుకుని.. అందులో కొన్ని నీళ్లు కలపండి. తర్వాత అందులో స్పాంజ్‌ లేదా స్క్రబర్‌ వేసి.. 5 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు స్క్రబర్‌తోజిడ్డుగా ఉన్న స్టీల్‌ ట్యాప్‌లను బాగా రుద్దండి. ఒక రెండు నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి శుభ్రం చేయడం వల్ల ట్యాప్‌లు ఎప్పుడూ కొత్తవాటిలా మెరుస్తాయని నిపుణులంటున్నారు.

వారం లేదా 15 రోజులకోసారి క్లీన్‌ చేయండి!
మనం ప్రతిరోజూ గిన్నెలు శుభ్రం చేసినప్పుడు, కాయగూరలు కడిగినప్పుడు.. ఎంతో కొంత చెత్త సింక్‌లో కూడా ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి, సింక్‌ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. కెమికల్స్‌ ఉండే లిక్విడ్‌వాష్‌లు, డిటర్జెంట్‌లు ఉపయోగించి సింక్‌ని క్లీన్‌ చేయడం వల్ల దాని నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి.. సహజసిద్ధంగా తయారుచేసిన పదార్థాలతో శుభ్రం చేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంట్లోనే ఉండే వెనిగర్, బేకింగ్ సోడా, నిమ్మ లేదా నారింజ తొక్కలు, ఆలివ్ నూనె.. మొదలైనవి ఉపయోగించి సింక్‌ని సులభంగా శుభ్రం చేయచ్చు.

ఫస్ట్‌ సింక్‌లో ఎలాంటి చెత్తా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఒక మెత్తటి స్పాంజ్ సాయంతో సింక్ అంతా వ్యాపించేలా బాగా రుద్ది, తర్వాత వెనిగర్‌తో శుభ్రంగా కడగాలి. తర్వాత నీటితో క్లీన్‌ చేసి నిమ్మ లేదా నారింజ తొక్కలతో మెల్లగా సింక్ మొత్తం రుద్దాలి. ఇలా చేయడం వల్ల సింక్ నుంచి దుర్వాసన రాకుండా, తాజాగా ఉండడంతోపాటు ఎప్పటికీ కొత్తదానిలా మెరిసిపోతూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మళ్లీ నీళ్లతో క్లీన్‌ చేసి, తడి పూర్తిగా ఆరిన తర్వాత మెత్తని వస్త్రంపై ఆలివ్‌నూనె వేసి సింక్ మొత్తం తుడవాలని సూచిస్తున్నారు.

బాత్‌రూమ్‌ టైల్స్‌ మురికిగా మారాయా ? ఈ నేచురల్​ క్లీనర్స్​తో మెరుపు గ్యారంటీ!

ఈ క్లీనర్​తో - మీ బాత్ రూమ్​ తళతళా మెరిసిపోద్ది!

ABOUT THE AUTHOR

...view details