Does Contraceptive Pills Increase Blood Pressure :వివాహం అయ్యాక కొంత మంది వెంటనే పిల్లలు వద్దు అనుకుంటారు. అలాంటి వారు అనుకోకుండా గర్భం ధరించకుండా ఉండేందుకు గర్భనిరోధక మాత్రలు యూజ్ చేస్తుంటారు. మరికొందరు.. మొదటి సంతానానికి, రెండో ప్రసవానికి మధ్య గ్యాప్ ఉండాలనుకుంటారు. వారు కూడా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతుంటారు. ఇలా.. ఈ మధ్య కాలంలో వీటి వినియోగం పెరిగింది. అయితే.. కొంతమందిలో వీటి వాడకం వల్ల పలు దుష్ప్రభావాలు తలెత్తుతాయని సూచిస్తున్నారు నిపుణులు.
సాధారణంగా.. గర్భ నిరోధక మాత్రలలో రెండు రకాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ఒకటి.. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ కాంబినేషన్ ఉన్నవి. రెండోది.. కేవలం ప్రొజెస్టరాన్ ఉన్నవి మాత్రమే. అయితే.. వీటిలో మీరు ఎంచుకునే దాన్ని బట్టి అవి ఆరోగ్యంపై చూపే సైడ్ ఎఫెక్ట్స్ ఆధారపడి ఉంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా.. కొంతమందిలో ఈస్ట్రోజెన్ ఉన్న పిల్స్ ఉపయోగించడం వల్ల 'బీపీ పెరిగే అవకాశం' ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఇప్పటికే బీపీ ఉన్నవారైనా, లేనివారైనా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ కాంబినేషన్ ఉన్న పిల్స్‌కు దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు.
గర్భనిరోధక మాత్రలు వాడితే పిల్లలు పుట్టరా?.. ఇందులో నిజమెంత?
అందుకు బదులుగా.. కేవలం ప్రొజెస్టరాన్ ఉన్న పిల్స్ ఉపయోగించడం కొంతవరకు బెటర్ అని సూచిస్తున్నారు. అలాగని ఇవి ఆరోగ్యానికి మంచివని చెప్పట్లేదు! వీటిని వాడే ముందు ఒకసారి మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి ఆపై నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ గర్భనిరోధక మాత్రలు వాడే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అనే విషయం మీరు గుర్తుంచుకోవాలంటున్నారు.
2020లో 'The Lancet' అనే వైద్య జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఈస్ట్రోజెన్ ఉన్న గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళలలో సిస్టోలిక్ రక్తపోటు 2 mmHg, డయాస్టోలిక్ రక్తపోటు 1 mmHg పెరిగే అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDC)లో పనిచేసే సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ గెర్ట్ డ్యూరెన్‌బెర్గ్ పాల్గొన్నారు. ఈస్ట్రోజెన్ ఉన్న గర్భనిరోధక మాత్రలు వాడే మహిళల్లో రక్తపోటు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే డేంజర్!