Best Weight Loss Workout :బరువు తగ్గడానికి జనాలు ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. మరికొందరు స్ట్రిక్ట్‌గా వర్కవుట్స్ చేస్తుంటారు. అయినప్పటికీ తేడా కనిపించదు. ఎంత సిన్సియర్‌గా చేస్తున్నా వెయిట్ తగ్గట్లేదని ఫీలవుతుంటారు. మీరు కూడా ఇలాంటి కండిషన్లో ఉంటే.. మీ కోసమే ఈ స్పెషల్ వర్కవుట్. దీనిపేరే.. జంపింగ్ లంజెస్(Jumping Lunges). మరి.. ఈ వర్కౌట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
జంపింగ్ లంజెస్ ఇలా చేయాలి..
ఇది ఒక డైనమిక్ వ్యాయామం. ఈ వర్కౌట్ బాడీలోని బహుళ కండరాలను గట్టి పడేలా చేస్తుంది. 30 నిమిషాలు జంపింగ్ లంజెస్ చేయడం వల్ల సగటున 180 నుంచి 240 కేలరీలు ఖర్చు అవుతాయి. కాబట్టి దీని ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చంటున్నారు వ్యాయామ నిపుణులు. మీ శక్తి స్థాయిలను బట్టి ఈ వర్కౌట్ స్పీడ్‌నెస్ పెంచుకోవడం, ఎక్కువసేపు చేయడం లాంటివి అలవాటు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
ముందుగా మీరు రెండు కాళ్ల మధ్య కాస్త గ్యాప్ ఉంచి నిటారుగా నిల్చొవాలి. ఆ తర్వాత కుడి కాలిని ముందుకు వంచి ఎడమ కాలును మోకాళ్ల మీద ఉండేట్లు చూసుకోవాలి.(అంటే లంజ్ పొజిషన్ ఉండేలా చూసుకోవాలి). ఆ తర్వాత కాస్త గాలిలోకి ఎగురుతూ జంప్ చేస్తూ పొజిషన్ ఛేంజ్ చేయాలి. అంటే కుడి కాలు, ఎడమ కాలు మార్చుతుండాలన్నమాట. ఇలా మారూస్తూ లంజెస్ చేయాలి. మీ శక్తి మేరకు వీలైనంత స్పీడ్‌గా చేయాలి.
ఇవి చేసే టైమ్‌లో రెండు చేతులు ముందుకూ వెనక్కి కదుల్చుతూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా త్వరగా బరువు తగ్గడంతోపాటు ఫిట్నెస్ పొందుతారంటున్నారు నిపుణులు. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మీ వీపును ఎక్కువగా సాగదీయకూడదు. అలా చేస్తే వీపు దిగువన ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే మోకాళ్లను సాఫ్ట్‌గా ల్యాండ్ చేయాలి. లేదంటే కీళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.