తెలంగాణ

telangana

ETV Bharat / health

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? - ఈ కూరగాయలు తింటే ఈజీగా వెయిట్ లాస్!

Weight Loss Vegetables: ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అధిక బరువు. అయితే చాలా మంది బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్​కు వెళ్లడం, తినే ఆహారాన్ని తగ్గించడం లాంటివి చేస్తుంటారు. అలాకాకుండా కొన్ని కూరగాయలతో ఈజీగా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం..

Weight Loss
weight

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 11:52 AM IST

Best Vegetables for Weight Loss:నేటి టెక్నాలజీ యుగంలో కాలంతో పోటీ పడుతూ పనులు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఉద్యోగం, బాధ్యతలు.. ఇలా అనేక కారణాలు మనిషి జీవితంతో పాటు శారీరక, మానసిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తున్నాయి. దాంతో వయసుతో సంబంధం లేకుండా అనేక మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా డయాబెటిస్, బీపీ, గుండె సమస్యల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా బరువు(Weight Loss)తగ్గి ఆరోగ్యంగా ఉండాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్​లలో తీవ్రంగా శ్రమించడంతో పాటు ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. అలాకాకుండా మీ ఇంట్లో ఉండే కూరగాయలతోనే ఈజీగా బరువు తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అందులో ఉండే అధిక ఫైబర్, తక్కువ కేలరీలు వెయిట్ లాస్​ అవ్వడానికి చాలా బాగా సహాయపడతాయంటున్నారు. ఇంతకీ వెయిట్​ లాస్ అవ్వడానికి ఏ కూరగాయలు తినాలి? ఏవి తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి తినాల్సిన కూరగాయలు ఇవే:

పాలకూర : బరువు తగ్గడానికి పాలకూర చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ప్రొటీన్ వేగంగా వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా మంచి జీర్ణక్రియ, రక్తంలో చక్కెరను నియంత్రించడం, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

బ్రోకలీ : బ్రోకలీలో కెరోటినాయిడ్లతో పాటు కాల్షియం, విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇది అదనపు ఫైబర్​ కలిగి ఉంటుంది. కాబట్టి బరువు తగ్గించడంలో బ్రోకలీ చాలా బాగా సహాయపడుతుంది.

క్యాబేజీ : వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు తమ డైట్​లో క్యాబేజీని చేర్చుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండి కేలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల క్యాబేజీలో కేవలం 25 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అలాగే వెయిట్​ లాస్​లో ఇది ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

బరువు తగ్గడానికి తిండి బంద్​ చేయొద్దు - ఈ పనులు చేయండి - తగ్గడం గ్యారెంటీ!

కాలీఫ్లవర్ : బరువు తగ్గాలనుకునే వారికి ఇది కూడా మంచి ఎంపిక అని చెబుతున్నారు నిపుణులు. కాలీఫ్లవర్ ఎక్కువ ఫైబర్, తక్కువ కేలరీలు, కొవ్వు కంటెంట్ కలిగి ఉంటుంది. అలాగే విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది ఒక కప్పులో కేవలం 27 కేలరీలను కలిగి ఉంటుంది. అతిగా తినడాన్ని నిరోధించి ఆకలిని తగ్గిస్తుంది.

క్యారెట్లు :ఇవి సహజంగా తక్కువ కేలరీలు, పోషకాలతో నిండి ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు తమ డైట్​లో వీటిని చేర్చుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చంటున్నారు నిపుణులు.

పుట్టగొడుగులు : వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పుట్టగొడుగులలో ఉండే పోషకాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి ఇది కూడా బరువు తగ్గడానికి మంచి ఆప్షన్​గా చెబుతున్నారు నిపుణులు.

తినకూడని కూరగాయలివే..

మొక్కజొన్న : ఇందులో అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న అధికంగా తింటే బరువు పెరగవచ్చు.

పచ్చి బఠానీలు : బఠానీలు అధిక రాఫినోస్ పరిమాణాలను కలిగి ఉంటాయి. ఇది జీర్ణం చేయడం కష్టంగా ఉండే సంక్లిష్ట చక్కెర. అధిక ఫైబర్ కారణంగా ఇవి జీర్ణ సంబంధిత సమస్యలను కూడా పెంచుతాయి. కాబట్టి వీలైనంత మేరు తగ్గించుకోవడం బెటర్.

బంగాళా దుంపలు :ఇవి రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతాయి. కాబట్టి వీటిని తింటే కడుపులో మంట, బరువు పెరగడానికి దారి తీయవచ్చు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు మీ డైట్​లో ఇవి లేకుండా చూసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

పడుకునే ముందు చేసే ఈ పొరపాట్లే - అధిక బరువు కారణం!

పెళ్లి తర్వాత బరువు పెరిగారా? - ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ ఫిగర్ పక్కా!

ABOUT THE AUTHOR

...view details