How to Wear Wigs and Hair Toppers:బట్టతల కారణంగా చాలా మంది చాలా మంది ఆత్మనూన్యతకు గురవుతుంటారు. అందవిహీనంగా ఉన్నామంటూ ఫీలైపోతుంటారు. ఇలాంటి వారిలో కొందరు విగ్, హెయిర్ టాపర్ యూజ్ చేస్తుంటారు. అయితే.. వాటిని సరిగ్గా ధరించినప్పుడే మంచి లుక్ వస్తుంది. లేదంటే.. తేడాగా ఉంటుంది. అందుకే.. విగ్ లేదా హెయిర్ టాపర్ ధరించేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే.. నిజమైన జుట్టు ఉంటే ఎంత అందంగా ఉంటారో అలా కనిపిస్తారు. ఆ స్టైలింగ్ చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సరైన విగ్ లేదా హెయిర్ టాపర్‌ని ఎంచుకోవడం :మార్కెట్లో రకరకాల స్టైల్స్, రంగులు, మెటీరియల్స్‌లో విగ్స్, హెయిర్ టాపర్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో మీ జుట్టు, వ్యక్తిత్వానికి సెట్ అయ్యే దాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. సరైన దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే అవి మీ జుట్టుతో బాగా కలిసిపోతాయి. అప్పుడు జుట్టును మీకు నచ్చిన స్టైల్లో ఈజీగా మార్చుకోవచ్చు. అదేవిధంగా విగ్ ఎంచుకునేటప్పుడు దాని పొడవు, రంగు, ఆకృతిని చూసి నాణ్యమైన దాన్ని తీసుకోవాలి.
శుభ్రమైన, పొడి జుట్టుతో :చాలా మంది టైమ్ అవుతుందని స్నానం చేయగానే తడి జుట్టుతోనే విగ్ లేదా హెయిర్ టాపర్ ధరించి వెళ్తుంటారు. అలాకాకుండా మీరు వాటిని ధరించే ముందు జుట్టు పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అలా ధరించడం ద్వారా జుట్టు చిక్కులు చిక్కులు ఉన్నా విగ్ కనిపించకుండా చేస్తుంది.
మంచి స్టైలింగ్ టూల్స్ ఎంచుకోవడం :విగ్ లేదా హెయిర్ టాపర్ ధరించడం ద్వారా స్టైల్‌గా కనిపించాలంటే.. మీరు చేయాల్సిన మరో పని ఏంటంటే.. హై క్వాలిటీ టూల్స్ వినియోగించడం. అంటే విగ్ బ్రష్, దువ్వెన, హెయిర్ డ్రయర్, హెయిర్ హీటింగ్ టూల్ వంటివి మంచి నాణ్యత కలిగి ఉండేలా చూసుకోవాలి.
డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయడం : మీరు విగ్ లేదా హెయిర్ టాపర్ ధరించినట్లయితే అది కనిపించే తీరులో పెద్ద తేడాను కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయడం ద్వారా మీ ముఖ ఆకృతికి, వ్యక్తిగత శైలికి ఏది బాగా సరిపోతుందో తెలుస్తుంది.