తెలంగాణ

telangana

ETV Bharat / health

ఆయిల్ రాసినా మీ జుట్టు గడ్డిలా ఎండిపోతోందా? - ఈ టిప్స్​తో చెక్ పెట్టండి! - Dry Hair Precautions

Best Hair Care Tips : కొందరు ఎంత నూనె పెట్టినా జుట్టు పొడిగా మారుతుంది. గడ్డిలా ఎండిపోతుంది. చూడ్డానికి ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఇలాంటి ప్రాబ్లమ్​తో ఇబ్బందిపడుతున్నారా? అయితే ఈ టిప్స్​తో ఈజీగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Hair
Hair Care Tips

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 3:57 PM IST

Best Tips for Removal Dry Hair :అందంగా కనిపించాలంటే చర్మ సౌందర్యంతోపాటు జుట్టు సంరక్షణ కూడా చాలా ముఖ్యం. అందుకే.. చాలా మంది ఒత్తైన, పొడవాటి కురులు సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇందుకోసం రకరకాల నూనెలు, క్రీమ్​లు, షాంపూలు, కండిషనర్లు వాడుతుంటారు. అయితే.. కొందరు జుట్టు సంరక్షణ కోసం ఎంత నూనె పెట్టినా పొడిబారుతుంది. దాంతో గడ్డిలా మారి చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంది. ఇంకొందరిలోజుట్టు(Hair)పొడిగా మారి విపరీతంగా ఊడిపోతుంది. మీరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా? ఏ విధంగా ఉపశమనం పొందాలనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఈరోజుల్లో చాలా మంది జుట్టు తేమను కోల్పోవడం వల్ల రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్​తో బాధపడుతున్నారు. అందులో జుట్టు పొడిబారే సమస్య కూడా ఒకటి. అయితే.. ఎంత నూనె పెట్టినా కూడా ఈ సమస్య తగ్గకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే.. మనం చర్మంపై సహజంగానే నూనె గ్రంథులు ఉంటాయి. అందులో.. మాడుపై ఉన్నవి తగినంత నూనెల్ని విడుదల చేయనప్పుడు హెయిర్​ గడ్డిలా తయారవుతుందంటున్నారు నిపుణులు. అయితే వయసు పెరిగేకొద్దీ చర్మంలో నూనెల విడుదల తగ్గుతుంది. ఇంకా... మెనోపాజ్‌, హార్మోనుల్లో అసమతుల్యత, హైపోథైరాయిడిజం వంటివీ ఈ సమస్యకు కారణమవొచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

జుట్టు భారీగా ఊడిపోతోందా? - ఇంట్లో దొరికే హెయిర్ మాస్క్​లతో రిజల్ట్ పక్కా!

ఇవేకాకుండా తరచూ తలస్నానాలు చేయడం, డ్రయ్యర్లతో జుట్టును ఆరబెట్టడం, ఐరనింగ్‌, స్ట్రెయిట్‌నర్లు, ఆల్కహాల్‌ ఆధారిత స్టైలింగ్‌ ఉత్పత్తులు అతిగా వాడినా ఈ సమస్య ఎదురవుతుందని అంటున్నారు. అంతెందుకు... అతిగా ఎండలో తిరగడం, వాహనాలపై ప్రయాణిస్తూ జుట్టును వదిలేసినా కూడా ఇలా కురులు పొడిబారతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మీరూ ఇలాంటి ప్రాబ్లమ్​తో ఇబ్బంది పడుతున్నారా? అయితే డోంట్ వర్రీ.. మేము చెప్పే ఈ టిప్స్ పాటించారంటే చాలు. ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..

  • ముందుగా మీరు ఈ సమస్యకు గల కారణమేంటో కనుక్కోవాలి. ఒకవేళ అనారోగ్యమైతే సంబంధిత మందులు వాడాలని చెబుతున్నారు నిపుణులు. ఆ తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందంటున్నారు.
  • తలస్నానం వారానికి మూడుసార్లకు మించకుండా చూసుకోవాలి. అదేవిధంగా రసాయనాల్లేని ముఖ్యంగా సల్ఫేట్లు, సిలికాన్‌ లేనివి, పీహెచ్‌ 5.5 ఉన్న షాంపూలకే ఇంపార్టెన్స్ ఇవ్వాలంటున్నారు నిపుణులు.
  • హెయిర్‌ స్టైలింగ్‌ ఉత్పత్తులు వాడాల్సి వస్తే ఆల్కహాల్‌ లేని రకాలను ఎంచుకోవాలి. ఒకవేళ వేడుకల కోసం ఉపయోగించినా వెంటనే తలస్నానం తప్పక చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • అదేవిధంగా కండిషనర్‌ వాడుతూ, వారానికి రెండుసార్లు అరటిపండు, పెరుగు, తేనె వంటివి కలిపి హెయిర్‌ ప్యాక్‌లు వేసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు.
  • ఇంకా కొబ్బరి, జొజొబా, బాదం నూనెల్లో నచ్చిన దాన్ని గోరువెచ్చగా చేసుకొని, తలకు పట్టించి.. మృదువుగా మర్దనా చేసి, రాత్రంతా వదిలేయాలి. మరుసటిరోజు తలస్నానం చేయడం అలవాటుగా చేసుకోండి. ఈ జాగ్రత్తలతో జుట్టు పొడిబారే లేదా గడ్డిలా మారే సమస్య చాలా వరకు అదుపులోకి వస్తుందని చెబుతున్నారు.

మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలా? ఈ ఫ్రూట్స్​ తీసుకుంటే చాలు

ABOUT THE AUTHOR

...view details