Best Fruits to Fight With Infections in Rainy Season:వర్షాకాలం స్టార్ట్ అయ్యిందంటే అనేక రకాల వ్యాధులు ఎటాక్ చేస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. జలుబు, దగ్గు మొదలు.. వర్షాకాలంలో డెంగ్యూ జ్వరం, మలేరియా, సీజనల్ ఫీవర్, టైఫాయిడ్ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా ఇబ్బంది పెడతాయి. ఈ క్రమంలోనే కొన్ని రకాల పండ్లు తీసుకుంటే ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ పండ్లు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయని అంటున్నారు. మరి ఆ లిస్ట్‌లో ఏఏ పండ్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బ్లూ బెర్రీ:వర్షాకాలంలో ఎదురయ్యే పలు రకాల ఆరోగ్య సమస్యలను తప్పించుకోవడానికి బ్లూబెర్రీలు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. వీటిని తీసుకోవడం ద్వారా తక్కువ క్యాలరీలు, ఐరన్, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు వంటి పోషకాలు లభిస్తాయని... ఇవి చిన్న చిన్న వ్యాధులతో పోరాడటానికి ఉపయోగపడతాయంటున్నారు.
లిచీ:వర్షాకాలంలో లిచీ పండును కచ్చితంగా తినాలని నిపుణులు అంటున్నారు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని.. ఇది మన శరీరంలో శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందని అంటున్నారు. అలాగే జలుబు నుంచి ఉపశమనం అందిస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను కూడా అందించి బరువు తగ్గడంలో సహాయపడుతుందని వివరిస్తున్నారు.
2011లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం లిచీ పండ్లు తినే వ్యక్తులు జలుబు బారిన పడటం 20% తక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బ్రిగామ్ యాంగ్ యూనివర్సిటీలో పోషకాహార శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ జె. డంకన్ పాల్గొన్నారు.
పియర్స్:వర్షాకాలంలో అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మనకు చాలా విటమిన్లు అవసరం. అయితే ఈ విటమిన్లు అన్నీ పియర్స్ పండ్లలో పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తినమని సలహా ఇస్తున్నారు.