తెలంగాణ

telangana

ETV Bharat / health

మీ బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా? - వెల్లుల్లిని ఇలా తీసుకుంటే కొవ్వు ఐస్​లా కరిగిపోతుంది! - How To Lower Cholesterol - HOW TO LOWER CHOLESTEROL

How To Reduce Cholesterol: మారిన జీవనశైలి కారణంగా ప్రస్తుత రోజుల్లో చాలా మంది హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. దాంతో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి రోజు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాకాకుండా డైలీ పచ్చి వెల్లుల్లిని ఇలా తీసుకుంటే ఈజీగా కొలెస్ట్రాల్​ను కరిగించుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే, వెల్లుల్లిని ఎప్పుడు? ఎలా? ఎంత? తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Best Food For Reduce Cholesterol
How To Lower Cholesterol (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Aug 22, 2024, 2:19 PM IST

Best Food For Reduce Cholesterol : ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి.. హై కొలెస్ట్రాల్. ఈ క్రమంలోనే చాలా మంది చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే తినే ఫుడ్​ని తగ్గిస్తుంటారు. అలాకాకుండా ఆరోగ్యకరంగా మీరు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించుకోవచ్చు తెలుసా? అందుకోసం.. మీరు చేయాల్సిందల్లా డైలీ పచ్చి వెల్లుల్లిని ఇలా తీసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు. ఇంతకీ, పచ్చి వెల్లుల్లిని ఎలా తినాలి? ఎప్పుడు తీసుకోవాలి? దాని వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఉల్లి లాగే వెల్లుల్లి(Garlic)ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే బోలెడు ఔషధ గుణాలు వెల్లుల్లి సొంతం. అందుకే వెల్లుల్లిని డైలీ డైట్​లో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. ఫలితంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

కొలెస్ట్రాల్​ను ఈజీగా కరిగిస్తుంది :హై కొలెస్ట్రాల్​తో బాధపడేవారు పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి సూరపనేని. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్​ను(Cholesterol)కరిగించి గుండె ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. అందుకు ప్రధాన కారణం.. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థమే. అందుకే.. శరీరంలో పేరుకున్న అధిక కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి సాటి లేదంటున్నారు. అంతేకాదు.. ఇందులోని ఔషధ గుణాలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించి, శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.

వెల్లుల్లిని ఎప్పుడు, ఎలా తినాలంటే?

చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి, ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్ లహరి. అది కూడా డైలీ మార్నింగ్ ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. రుచి చేదుగా అనిపిస్తే.. తిన్నాక కొంచెం వాటర్ తాగొచ్చంటున్నారు. లేదంటే.. పచ్చి వెల్లుల్లిని తినడానికి ఇబ్బంది పడే వారు తేనెతో కలిపి తినవచ్చు. అలా తిన్నా మంచి ఆరోగ్యప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు.

దిండు కింద వెల్లుల్లి పెట్టుకుని పడుకుంటే ఏమవుతుందో తెలుసా?

మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు :వెల్లుల్లిని ఇలా తినడం వల్ల కేవలం చెడు కొలెస్ట్రాల్ తగ్గడం మాత్రమే కాకుండా మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి వెల్లుల్లిలోని పోషకాలు చాలా బాగా సహాయపడుతాయి. అలాగే రక్తం గట్టకట్టే ప్రమాదం కూడా తగ్గుతుందట. అదేవిధంగా రోగనిరోధక శక్తిన పెంపొందించుకోవచ్చని సూచిస్తున్నారు. అంతేకాదు.. డైలీ మార్నింగ్ రెండు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్ లహరి.

వెల్లుల్లిలోని రసాయనాలు ఐరన్ విడుదలను ఎక్కువగా ప్రేరేపిస్తాయి. దీంతో అనీమియా సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు. వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు అల్జీమర్స్‌, డిమెన్షియా లాంటి అనారోగ్యాలను అడ్డుకుంటాయి. అదేవిధంగా ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపించి మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో పచ్చి వెల్లుల్లిలోని ఔషధ గుణాలు ఎంతగానో తోడ్పడతాయంటున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఆఫ్ట్రాల్ 'వెల్లుల్లి పొట్టు' అని తీసిపారేస్తున్నారా? - ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్​ పక్కా!

ABOUT THE AUTHOR

...view details