Shiva Rajkumar Health Update : శాండల్‌వుడ్ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ తాజాగా అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. మూత్రాశయానికి సంబంధించిన క్యాన్సర్‌ను తొలగించినట్లు ఆయనకు ఆపరేషన్ చేసిన సర్జన్ వీడియో మెసేజ్ ద్వారా తెలిపారు. ఇక ఆయన ప్రేగులను ఉపయోగించి ఓ కృత్రిమ మూత్రాశయాన్ని సృష్టించారని ఆ వైద్యుడు పేర్కొన్నారు. ఈ మాట విన్న అభిమానులు ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు శివ రాజ్‌కుమార్ ఫ్యామిలీ కూడా ఓ ప్రకటన ద్వారా ఆయన హెల్త్ అప్డేట్ పంచుకున్నారు. ఆయన క్షేమం కోసం ప్రార్థించిన అభిమానులు, శ్రేయోభిలాషులు, అలాగే సన్నిహితులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రికవరీకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Thank You #Geethakka ❤🙏🏼 You Stood with Anna ❤❤❤
— ShivaSainya (@ShivaSainya) December 25, 2024
Take Rest and Get Well Soon #Shivanna ❤🥹 We Will be waiting for to welcome you on Jan 26th 😍
Special thanks to doctor's🙏🏼 #DrShivarajkumar #Shivarajkumar #ShivaSainya @NimmaShivanna ❤❤❤ @ShivaSainya pic.twitter.com/isgcCcC520
"బుధవారం ఆయనకు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నెమ్మదిగా ఆయన కోలుకుంటున్నారు." అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అనారోగ్యం గురించి తొలిసారి అలా :
అయితే ఆయన రీసెంట్ మూవీ 'భైరతి రంగల్' ప్రమోషన్స్ టైమ్‌లోనే శివ రాజ్‌కుమార్ తొలిసారి తన అనారోగ్య సమస్య గురించి మాట్లాడారు. "నా ఆరోగ్య సమస్య గురించి తెలిసినప్పుడు ఫస్ట్ టైమ్ నేను చాలా భయపడ్డాను. అభిమానులు, ప్రజలు కలవరపడటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. దాన్ని నేను ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పొందాను. ఇప్పుడంతా బాగానే ఉంది. నేను కూడా ఓ మనిషినే కదా. నాకు కూడా సమస్యలు వస్తుంటాయి. నాకు వచ్చిన అనారోగ్యానికి సంబంధించి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను" అని శివ రాజ్‌కుమార్ ఆ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ప్రస్తుతం శివరాజ్ కుమార్ అప్‌కమింగ్ మూవీస్ చూసుకుంటే 'భైరవుడు', 'ఉత్తరకాండ', '45', 'RC 16' చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకుని ఆయన తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారని సినీ వర్గాల సమాచారం.
'టాలీవుడ్లో వారంతా నా స్నేహితులే... బాలకృష్ణతో కలిసి సినిమా..!'
అవును బాధపడుతున్నా- సర్జరీ కోసం అమెరికా వెళ్తున్నా: శివరాజ్ కుమార్