Gold Theft Case in Hyderabad : ఇంట్లో పనికి ఎవరిని పడితే వారిని ఎవరైనా నియమిస్తున్నారా? వారు కొద్ది రోజులు మిమ్మిల్ని నమ్మించడానికి నమ్మకంగా ఉంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత తెలుస్తోంది వారి అసలు రూపం. అసలు వారి గురించి తెలియకుండా నియమిస్తే ఇంట్లో ఉన్న సొత్తునే దోచుకెళుతున్న ఘటనలు చూస్తున్నాం. అయినా సరే వారిపై నమ్మకం ఉంచి ఇంట్లో పనికి పెడుతున్నాం. తీరా మోసం చేసిన తర్వాత పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతారు. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో భార్యభర్తలను పనికి కుదిర్చితే 25 తులాల బంగారం, రూ.30 వేల నగదును దోచేసిన ఉదంతంగా సంచలనంగా మారింది. వారిద్దరినీ పోలీసులు పట్టుకుని వారి నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత వారిని అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ కొండల్ రెడ్డి నివాసం ఉంటున్నారు. వారి ఇంట్లో నవంబరు నెలలో పని చేయడానికి భార్యాభర్తలు కుదిరారు. బిహార్ రాష్ట్రానికి చెందిన నమీన్కుమార్ యాదవ్, భారతిలుగా వారు తమ చిరునామాలను చెప్పారని ఆయన తెలిపారు. చక్కగా నెలరోజులుగా ఇంట్లోనే ఉండి అక్కడే పనులు చేసేవారు. సోమవారం రాత్రి దంపతులు ఓ సంచి పట్టుకొని బయటకు వెళ్లారు. మంగళవారం ఉదయం కూడా ఇంటికి రాకపోవడంతో కొండల్ రెడ్డి వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాప్ అని వచ్చింది. అనుమానం వచ్చిన కొండల్‌రెడ్డి కుటుంబ సభ్యులు వెంటనే ఇంట్లోని అల్మారాను తనిఖీ చేశారు.
అందులోని 25 తులాల వివిధ రకాల బంగారు ఆభరణాలు, రూ.35 వేలు డబ్బు మాయం అయ్యాయి. దీంతో వారు షాక్‌కు గురయ్యారు. పని మనుషులుగా చేరిన వారే వాటిని చోరీ చేసి ఉడాయించినట్లు కొండల్ రెడ్డి రాజేంద్రనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నెల రోజుల పాటు ఇంట్లో ఎంతో నమ్మకంగా పని చేసి ఇలా చోరీ చేయడంతో యజమానులు షాక్‌కు గురయ్యారు.
అరెస్ట్ చేసిన పోలీసులు : రాజేంద్రనగర్‌లో చోరీకి పాల్పడిన బిహార్‌కు చెందిన దంపతులను పోలీసులు చాకచక్యంతో అరెస్టు చేశారు. నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఇద్దరిని పట్టుకున్నారు. చోరీ చేసి బంగారు ఆభరణాలతో బీహార్‌కు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారి నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్‌లోని కొండల్ రెడ్డి అనే వైద్యుడి ఇంట్లో బిహార్ దంపతులు పనికి చేరి 25 తులాల బంగారం, రూ.30 వేల నగదు చోరీ చేశారు.
వెంబడించి మరీ కండక్టర్ పట్టుకుంటే - తాగేసి ఉన్నాడని పోలీసులు వదిలేశారు