ETV Bharat / state

ఈ కోళ్లను పెంచితే లక్షల్లో ఆదాయం - ఒక్క కోడి అమ్మితే అంత లాభమా! - BREEDING OF ASEEL CHICKS WANAPARTHY

ఇంటి ఆవరణలో అసిల్‌ జాతి కోళ్లను పెంచుకుంటున్న వనపర్తికి చెందిన వ్యక్తి - లక్షల్లో ధర పలుకుతున్న ఒక్కో కోడి

Aseel chicks In wanaparthy
Breeding of Aseel chicks In wanaparthy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 12 hours ago

Aseel Chicks in Wanaparthy : తెలంగాణలో నాటుకోడి పేరు చెబితే పందెం కోళ్లతో పాటు, మసాలాతో వండిన నాటు కోడి కూర నోరూరిస్తాయి. అదే ఆంధ్రాలోనైతే సంక్రాంతికి కోడి పందాలకు నాటు కోడికి భలే గిరాకీ ఉంటుంది. అందులో ప్రత్యేకంగా చాలా మంది పందాల కోసం నాటుకోళ్లను పెంచుతారు. వాటి కోసం లక్షలకు లక్షలు డబ్బులు ఖర్చు చేసి.. ఆ ఖర్చుకు కొన్ని రెట్ల లాభాలను చూస్తారు. ఒకరకంగా చెప్పాలంటే రకాన్ని బట్టి ఒక్కో కోడి ధర రూ.50 వేలు నుంచి రూ.1 లక్ష వరకు పలుకుతుంది. కానీ వనపర్తి జిల్లాలోని ఓ వ్యక్తి మాత్రం సరదా కోసం నాటు కోళ్లను పెంచి లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు. చాలా మంది పందెం కోసం మాత్రమే నాటుకోళ్లను పెంచుతుంటారనే భావనలో ఉండిపోతారు.

రూ.లక్షలు పలికే కోళ్లు : వనపర్తి మండలం రాజనగరం గ్రామానికి చెందిన గురునందన్ రెడ్డి కొన్నేళ్లుగా తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ఆసిల్ జాతి కోళ్లను పెంచుతున్నాడు. వాటి తిండికే అతగాడికి లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ వాటిని అమ్మితే మాత్రం దానికి రెంటింపు స్థాయిలో ఆదాయం వస్తుంది. ఈయన 2006 లో మార్కెటింగ్ శాఖ కార్యదర్శిగా ఉద్యోగ విరమణ పొందాక ఆయన వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం కూడా దృష్టి సారించారు. దీంతో రకరకాల కోళ్లను పెంచుతున్నారు. దీంట్లో చిలక ముక్కు, నెమలి తోక, పొడవాటి మెడ, బలమైన శరీర సౌష్టవం ఉన్న అసిల్ జాతి కోళ్లకు డిమాండ్ బాగా ఉందని గమనించారు. దీంతో 2007 లో లక్ష వెచ్చించి రెండు జతల పిల్లలు తీసుకువచ్చారు. అవి పెద్దగా పెరిగి మళ్లీ పిల్లలు పెట్టింది.

ఇంటి ఆవరణలో పెరుగుతున్న అసిల్‌ జాతి కోళ్లు : ఇలా చాలా కోళ్లు పెరిగాయి. వీటిని కొనుగోలు చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి చాలా మంది వస్తున్నారని గురునందన్ రెడ్డి తెలుపుతున్నారు. ఇప్పటి వరకు తన వద్ద పెరిగిన కోళ్లను గరిష్ఠంగా రూ.50వేలకు అమ్మానని వివరించాడు. తనకు నచ్చిన కోళ్లను రూ. లక్ష వరకు అమ్మానని తెలిపారు. ప్రస్తుతం ఆయన వద్ద చిన్నవి, పెద్దవి కలిపి 50పైగా ఆసిల్ కోళ్లు ఉన్నాయని వెల్లడించారు.

ఒకే గుడ్డు నుంచి 2 కోడి పిల్లలు - నుదుటన ముక్కుతో మేక - ఈ వింతలు మీరు చూశారా?

ఊపందుకున్న కోడి పందేలు - చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.