Best Food for Regular Periods as per Ayurveda: పీరియడ్స్ అనేవి మహిళలు ప్రతినెలా ఎదుర్కొనే ఓ సమస్య. కొద్దిమందిలో నెలసరి సక్రమంగా వస్తే.. మరికొద్దిమంది మాత్రం ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బ్లీడింగ్ సరిగా కాకపోవడం వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటారు. దీని కారణంగా శరీరంలో అంతర్గతంగా పలు ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి. అంతేకాదు.. పీరియడ్స్(Periods) టైమ్‌కు రాకపోవడం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మరి మీరూ ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? అయితే, నేచురల్‌గా ఈ ప్రాబ్లమ్‌ను తగ్గించుకోవచ్చంటున్నారు ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవీ. అందుకోసం ఈ పథ్యాహారాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- నువ్వులు
- జీలకర్ర
- మెంతులు
- ఉప్పు
- కారం
- ఇంగువ
తయారీ విధానం:
- ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నువ్వులు వేయించుకోవాలి. ఆ తర్వాత మెంతులు, జీలకర్రను కూడా విడివిడిగా వేయించుకోవాలి.
- ఇలా వేయించుకున్న నువ్వులు, మెంతులు, జీలకర్రను సపరేట్ మిక్సీ జార్‌లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఓ బౌల్ తీసుకుని అందులోకి 100 గ్రాముల నువ్వుల పొడి, 50 గ్రాముల జీలకర్ర పొడి, 25 గ్రాముల మెంతి పొడి, పావు చెంచా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, అర చెంచా కారం వేసుకుని ఈ పదార్థాలన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలి.
ఎలా తీసుకోవాలంటే: నెలసరి సమయానికి రాకుండా ఇబ్బంది పడేవారు ఈ పొడిని రోజూ రెండు సార్లు తీసుకోవాలని చెబుతున్నారు. అంటే ఉదయం, సాయంత్రం అన్నం తినే సమయంలో ఒక ముద్ద అన్నంలో ఈ పొడిని ఒక చెంచా చొప్పున కలిపి తినాలని చెబుతున్నారు. అంటే ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా తీసుకోవాలి.