How To Make Soya Dosa Recipe At Home :మారిన జీవనశైలి కారణంగా ఈరోజుల్లో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్తో బాధపడుతున్నారు. దీంతో షుగర్ బాధితులుకఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ నోటిని కట్టేసుకుంటుంటారు. ఏ ఆహారం తిందామన్నా ఎక్కడ షుగర్ లెవల్స్ పెరుగుతాయో అనే భయంతో వెనకాడుతుంటారు. అలాంటి వారికి ఎంతో మేలు చేసే ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని పట్టుకొచ్చాం. అదే.. సోయా దోశ(Soya Dosa).
ఈ దోశ తయారీ కోసం ఎక్కువ సమయం కూడా పట్టదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు.. ఈ దోశ రెసిపీలో షుగర్ లెవల్స్ పెంచే ఆహార పదార్థాలు లేవు! కాబట్టిడయాబెటిస్(Diabetes) ఉన్నవారు సోయా దోశను ఎలాంటి ఇబ్బంది లేకుండా తినవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, సోయా దోశ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- ఒక కప్పు - సోయా పాలు
- పావు కప్పు - గోధుమపిండి
- సరిపడినంత - నూనె
- రుచికి సరిపడా - ఉప్పు
- చిటికెడు - బేకింగ్ సోడా
- 1 టీస్పూన్ - జీలకర్ర
- కొద్దిగా - పచ్చిమిర్చి తరుగు
- అరకప్పు - ఉల్లిపాయ తరుగు
- కొద్దిగా - కొత్తిమీర తరుగు