Walking After Eating Heath Benefits :నేటి బిజీ లైఫ్‌లో ఎక్కువ మంది ఉద్యోగం, వ్యాపారాలలో నిమగ్నమై ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అలాగే మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి శారీరక శ్రమ లేకపోవడం.. వంటివి ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ముఖ్యంగా ఊబకాయం, అధికబరువు, డయాబెటిస్ వంటి సమస్యల బారిన పడుతుంటారు. అందుకు ప్రధాన కారణం.. భోజనం తర్వాత కాసేపు నడవకపోవడమేనట! తిన్నాక కనీసం 100 అడుగుల కంటే ఎక్కువ నడవకపోవడం వల్లనే అధికబరువు పెరిగి వివిధ హెల్త్ ప్రాబ్లమ్స్‌ను కొని తెచ్చుకుంటున్నారంటున్నారు నిపుణులు. అంతేకాదు.. భోజనం తర్వాత కనీసం 100 అడుగుల కంటే ఎక్కువ నడిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో కూడా వివరిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీర్ణక్రియకు మేలు : భోజనం చేశాక కాసేపు నడిస్తే.. జీర్ణక్రియ ఎంతో మెరుగుపడుతుందని సూచిస్తున్నారు నిపుణులు. తిన్నాక నడవడం వల్ల పేగుల్లో కదలికలు చక్కగా జరిగి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయంటున్నారు. ఫలితంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుందని.. మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలూ తగ్గుతాయని సూచిస్తున్నారు.
2014లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఆరోగ్యవంతమైన వ్యక్తులు తిన్నాక 10 నిమిషాలు నడిచినప్పుడు వారి జీర్ణక్రియ రేటు గణనీయంగా పెరిగిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూజిలాండ్‌లోని ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ M.J. శాండ్స్ పాల్గొన్నారు. భోజనం చేశాక కొద్దిసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగై.. ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి వంటి లక్షణాలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది : తిన్నాక కొద్దిసేపువాకింగ్(Walking) చేయడం రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది గుండెను బలపర్చడమే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల ముప్పును తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. అలాగే.. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.
వెయిట్ లాస్కి తోడ్పడుతుంది :భోజనం తర్వాత కాసేపు నడవడం బరువు తగ్గడానికి తోడ్పడుతుందంటున్నారు. ఎందుకంటే.. తిన్నాక నడవడం వల్ల ఎక్కువ మొత్తంలో కేలరీలు బర్న్ అవుతాయి. అది వెయిట్‌ను అదుపులో ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుందని సూచిస్తున్నారు.
హెల్దీగా ఉండటానికి - ఏ వయసువారు ఎంత దూరం నడవాలి ? మీకు తెలుసా ?