Bathroom Shower Cleaning Tips :ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం మహిళలు ఎంతో కష్టపడుతుంటారు. ఓపిక ఉన్నా, లేకపోయినా కూడా ఇంటిని క్లీన్‌గా ఉండేలా చూస్తారు. అలాగే రెండు, మూడు రోజులకు ఒకసారి బాత్‌రూమ్‌ను కూడా వివిధ రకాల డిటర్జెంట్‌లు, క్లీనర్‌లతో కడుగుతుంటారు. అయితే బాత్‌రూమ్‌ను తళతళ మెరిసేలా చేయడానికి ఎన్నో రకాల క్లీనర్‌లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల బాత్‌రూమ్‌లోని టైల్స్, ట్యాప్స్, సింక్ వంటి వాటిని కొత్తవాటిలా మెరిపించవచ్చు.
కానీ.. కొంతమందికి బాత్‌రూమ్‌లోని షవర్‌హెడ్‌ను మాత్రం శుభ్రం చేయడం రాదు. చాలా రోజులు షవర్‌హెడ్‌ను క్లీన్ చేయకపోతే.. అందులో నుంచి వాటర్ ప్రెజర్ తక్కువగా వస్తుంది. అలాగే షవర్‌హెడ్‌లో పాచి, దుమ్ము పెరుకుపోయి మనకు అలర్జీ వంటివి కూడా వస్తుంటాయి. అందుకే.. షవర్‌హెడ్‌ను క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈజీగా షవర్‌హెడ్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
తుప్పు వదిలిద్దాం ఇలా..
ముందుగా షవర్‌హెడ్‌ను ఒక చిన్న బ్రష్ సహాయంతో క్లీన్ చేయండి. తర్వాత షవర్‌హెడ్‌ను బయటకు తీయండి. ఇప్పుడు ఒక మగ్‌లో లీటర్ నీళ్లు తీసుకుని.. అందులో ఒక నిమ్మకాయ పిండండి. ఇందులోకి 4 టేబుల్‌స్పూన్‌లబేకింగ్ సోడా, అరకప్పు వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇందులో మీరు కొద్దిగా డిటర్జెంట్ పౌడర్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ లిక్విడ్‌లో షవర్‌హెడ్‌ను ముంచండి. ఒక 20 నిమిషాల తర్వాత మీరు షవర్ హెడ్‌ను క్లీన్ చేస్తే.. కొత్తదానిలా మెరిసిపోతుంది. ఇలా చేయడం వల్ల షవర్‌హెడ్ రంధ్రాలలోని తుప్పు మొత్తం బయటకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.