Health Benefits of Avocado :మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో చాలా మంది శరీరానికి తగిన పోషకాలు అందాలని డైలీ వివిధ రకాల పండ్లు తీసుకుంటుంటారు. అయితే అందులో అవకాడో ఉంటుంది. అయితే చాలా మంది దీనిని ఎప్పుడో ఒకసారి తింటుంటారు. అలాకాకుండా ప్రతిరోజు అవకాడోను తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. మరి అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
అవకాడో పోషకాలు: అవకాడోను బట్టర్ ప్రూట్ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, పొటాషియం, విటమిన్ A, విటమిన్ సి, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్, ఫోలేట్ వంటివి చాలానే ఉన్నాయి. కాబట్టి దీనిని రెగ్యులర్‌గా తింటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. అవేంటంటే..
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు డైలీ అవకాడోలను తీసుకోవడం ద్వారా కంటి చూపు బాగుంటుంది. ఇందులో పుష్కలంగా ఉండే లుటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు ఐ హెల్త్‌కి ఎంతో బాగా సహాయపడతాయి. అదే విధంగా అవకాడోలో ఉంటే న్యూట్రియెంట్స్ మంచి ఐ సైట్‌ని మెయింటెయిన్ చేయడంతో పాటు నైట్ టైమ్ కళ్లు స్పష్టంగా కనిపించేటట్లు చేస్తాయి. ముఖ్యంగా UV కిరణాల వల్ల కంటికి కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. అవకాడోలో విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని తినడం వల్ల వయసుతో పాటు వచ్చే మాక్యులర్ డీజనరేషన్ వంటి కంటి సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు.
వెయిట్ లాస్ :బరువు తగ్గాలనుకునే వారు తమ డైలీ డైట్లో అవకాడోను చేర్చుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు. అవకాడోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని తింటే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా త్వరగా ఆకలివేయదు. ఇందులో కార్బ్స్ కూడా తక్కువగానే ఉంటాయి.
ఒత్తిడిని తగ్గిస్తుంది :అవోకాడోలో ఫోలేట్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది సంతోషకరమైన హార్మోన్లను ప్రోత్సహించడంలో చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఫోలేట్ కంటెంట్ తక్కువగా ఉన్నవారు డిప్రెషన్‌కు లోనవుతారు. కాబట్టి దీనిని డైలీ తీసుకోవడం ద్వారా ఆ పరిస్థితి రాకుండా చూసుకోవచ్చంటున్నారు. ఈ పండు పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది. అందుకే ప్రెగ్నెంట్స్ ఈ ఫ్రూట్‌ని వారి డైలీ డైట్లో భాగం చేసుకుంటే బిడ్డ ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.
నీరసం తగ్గి రోజంతా యాక్టివ్‌గా ఉండాలా? - అయితే ఈ ఫ్రూట్స్ తినాల్సిందే!