తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇంటర్నేషనల్ లెవెల్​లో 'టాక్సిక్‌' రిలీజ్ - డిసెంబర్​ కల్లా థియేటర్లలోకి! - YASH TOXIC INTERNATIONAL RELEASE

యశ్ 'టాక్సిక్' మూవీ కీలక అప్డేట్- రెండు వెర్షన్లలో సినిమా రిలీజ్- ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరంటే?

Yash Toxic International Release
Yash Toxic Movie (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2025, 1:47 PM IST

Yash Toxic International Release : 'కేజీయఫ్‌-2' వంటి బ్లాక్​బ‌స్ట‌ర్ త‌ర్వాత కన్నడ రాకింగ్ స్టార్ హీరో యశ్ నటిస్తున్న చిత్రం 'టాక్సిక్'. 'యశ్ 19'గా తెరకెక్కతున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వ‌హిస్తున్నారు. గ్యాంగ్​స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా ముస్తాబు అవుతున్న ఈ సినిమాను కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఈ మధ్య కాలంలో రోజుకో వార్త బయటకు వస్తూ ఫుల్ ట్రెండింగ్ అవుతోంది.

రెండు వెర్షన్లలో టాక్సిక్
ఈ ఏడాది డిసెంబరులో 'టాక్సిక్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోందని సమాచారం. అయితే షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న తర్వాత అఫిషీయల్ రిలీజ్ డేట్​ను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా వెర్షన్‌, ఇంటర్నేషనల్‌ వెర్షన్​గా రెండు రూపాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే 'టాక్సిక్' సినిమాకు అంతర్జాతీయ పంపిణీదారుడిగా వ్యవహరించేందుకు 20th సెంచరీ ఫాక్స్‌ సహా ఇతర సంస్థలతో చర్చలు జరిపినట్లు టాక్. ఈ చర్చలు 2025 వేసవి నాటికి పూర్తవుతాయని సమాచారం.

వీఎఫ్ఎక్స్ కు ప్రాధాన్యం
గ్యాంగ్‌ స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా ముస్తాబు అవుతున్న టాక్సిక్ లో వీఎఫ్‌ఎక్స్‌ కు ఎంతో ప్రాధాన్యమున్నట్లు తెలిసింది. అందుకే దానికోసం యూఎస్‌ లోని కొన్ని ప్రముఖ అంతర్జాతీయ వీఎఫ్‌ ఎక్స్‌ స్టూడియోలతో సంప్రదింపులు జరుపుతోందట చిత్ర బృందం. ఈ క్రమంలో టాక్సిక్ ను గ్లోబల్ ప్రాజెక్ట్‌ గా మార్చేందుకు మేకర్స్ భావిస్తున్నారట. కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం వంటి పలు భాషల్లో విడుదల కానుంది. అలాగే పాన్ ఇండియాలోనే కాకుండా, విదేశాల్లోనూ రిలీజ్ కానుంది.

హీరోయిన్లగా వీరేనా!
అయితే యశ్ 'టాక్సిక్' సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశమున్నట్లు సమాచారం అందుతోంది. వాటిలో ఓ పాత్ర కోసం సాయిపల్లవి పేరు పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే శ్రుతిహాసన్, నయనతార, కియారా అద్వాణీ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

ఉపేంద్ర 'యూఐ'పై యశ్​, కిచ్చా సుదీప్ కామెంట్స్​

రామ్​చరణ్​ హీరోయిన్​ను పట్టేసిన రాకింగ్ స్టార్​ యశ్​! - Toxic Movie Heroine

ABOUT THE AUTHOR

...view details