తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: వైల్డ్​కార్డ్​ ఎంట్రీ బ్యాచ్​ సిద్ధం! - వచ్చేది వీళ్లేనటగా! - Wild Cards in Bigg Boss Season 8 - WILD CARDS IN BIGG BOSS SEASON 8

Bigg Boss 8: బిగ్‌బాస్ సీజన్ 8లో.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ముహూర్తం సిద్ధమైనట్టు సమాచారం. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. అంతేకాదు.. ఎవరెవరు రాబోతున్నారనే పేర్లు కూడా లీకయ్యాయని ప్రచారు సాగుతోంది. మరి.. వాళ్లెవరో తెలుసా?

bigg boss
bigg boss (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 2:29 PM IST

Wild Cards in Bigg Boss Season 8 Telugu:బిగ్​బాస్​ సీజన్​ 8లో "ట్విస్ట్​లకు, టర్న్​లకు, ఫన్​లకు.. లిమిటే లేదు" అంటూ చెప్పారు. కానీ చెప్పినంత హైప్​ అక్కడలేదనేది అభిమానుల వాదన. ఎందుకంటే.. హౌజ్​లో ఉన్న వారు గొడవలతో కాలక్షేపం చేస్తున్నారు తప్పించి.. టాస్క్​లు ఆడటం, ఎంటర్​టైన్​ చేయడం వంటి మాటే లేదు. దీంతో షో చూడాలంటేనే విసుగొస్తుదంటున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల్లో షో పట్ల మళ్లీ క్యూరియాసిటీని పెంచేందుకు సీజన్​ 7 మాదిరిగా వైల్డ్​కార్డ్​ ఎంట్రీస్​ను ప్లాన్​ చేస్తున్నారని.. వారిలో కొద్దిమంది పేర్లు ఇవే అంటూ సోషల్​ మీడియా కోడై కూస్తోంది. ఆ సమాచారం ప్రకారం ఎవరు వైల్డ్​కార్డ్​ ఎంట్రీ ఇవ్వనున్నారు? ఎంట్రీ డేట్​ ఎప్పుడో చూద్దాం.

సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న సమాచారం ప్రకారం.. మొత్తంగా ఏడుగురు వైల్డ్​ కార్డ్​ ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. కొత్త కంటెస్టెంట్లతో పాటు గత ఏడు సీజన్లలో పార్టిసిపేట్​ చేసి కొంతమంది కంటెస్టెంట్లు కూడా ఉండబోతున్నారట. ఇందులో ఐదుగురు ఇప్పటికే కన్ఫార్మ్ అయ్యారని టాక్​. వాళ్లు చూసుకుంటే..

హరితేజ: మొదట్లో పలు సీరియల్స్​లో నటించిన ఈమె.. సిల్వర్ స్క్రీన్​పై అవకాశాలు రాబట్టింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ హోస్ట్​గా వ్యవహరించిన బిగ్​బాస్ తెలుగు 1లో అవకాశం దక్కించుకుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్​గా మారి 3వ స్థానంలో నిలిచింది. అయితే ఈ లేడీ ఇప్పుడు సీజన్​ 8లో పాల్గొననుందని టాక్​..

రోహిణి:లేడీ కమెడియన్​గా ఫేమ్ రాబట్టింది రోహిణి. గతంలో పలు సీరియల్స్​లో కూడా నటించింది. ప్రస్తుతం పలు కామెడీషోలతో పాటు వెండితెరపై సత్తా చాటుతోంది. బిగ్​బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొన్న రోహిణి.. తన మార్క్ గేమ్​తో ప్రేక్షకులకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే నాలుగో వారం ఎలిమినేట్ అయ్యింది. దీంతో తిరిగి సీజన్ 8లో కంటెస్ట్ చేయనుందట.

అవినాష్​:బిగ్​బాస్​ సీజన్ 4 కంటెస్టెంట్స్​లో ముక్కు అవినాష్ ఒకరు. ఆ సీజన్​లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. అతడి బాడీ లాంగ్వేజ్, జోక్స్ నవ్వులు పూయించేవి. అవినాష్ అంచనాలకు మించి రాణించాడు. పది వారాలకు పైగా హౌజ్​ ఉన్నాడు. అయితే ముక్కు అవినాష్ బిగ్​బాస్ తెలుగు సీజన్ 8లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అనేది తాజా న్యూస్.

నిన్న రేషన్​ కోసం - నేడు ప్రైజ్​ మనీ కోసం - హోరాహోరీగా ఫైట్​ చేస్తున్న కంటెస్టెంట్లు - ప్రోమోలు చూశారా?

శోభా శెట్టి:సీజన్ 7లో కంటెస్ట్ చేసిన శోభా శెట్టి ఫైర్ బ్రాండ్​గా పేరుగాంచింది. అత్యంత నెగిటివిటీతో బయటకు వచ్చిందీ భామ. ఎదురుగా ఎవరున్నా ఆమె తగ్గేది కాదు. ఒక రేంజ్ లో విరుచుకుపడేది. శోభా శెట్టి మాట తీరు, బాడీ లాంగ్వేజ్ వివాదాస్పదం అయ్యాయి. గత సీజన్​లో శోభా శెట్టి 14 వారాలు హౌస్ లో ఉంది. సీజన్ 8లో ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనుందట.

టేస్టీ తేజ: సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసిన మరొక కంటెస్టెంట్ టేస్టీ తేజ. ఎలాంటి అంచనాలూ లేకుండా అడుగుపెట్టిన టేస్టీ తేజా ఎంటర్టైనర్​గా పేరు తెచ్చుకున్నాడు. ఇతని పేరు సైతం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ లిస్ట్​లో ఉందని సమాచారం.

పైన చెప్పిన ఐదుగురు కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. ఇక కొత్తవాళ్లగా రీతూ చౌదరి, సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్. రీతూ చౌదరి.. విష్ణుప్రియ జిగిరీ దోస్తులు అన్న సంగతి తెలిసిందే. ఇక కావ్య.. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న నిఖిల్‌కి బెస్ట్ ఫ్రెండ్.

ఎప్పుడంటే:బిగ్​బాస్​ సీజన్​ 7 2.0 పేరుతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే పద్ధతి పెట్టారు. ఈ ఈవెంట్​ను కూడా గ్రాంఢ్​గా లాంచ్​ చేసి ఐదుగురిని హౌజ్​లోకి పంపించారు. అప్పుడు ఈ కాన్సెప్ట్​ బాగానే వర్కవుట్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా అర్జున్ అంబటి హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత టాస్కుల్లో మిగిలిన కంటెస్టెంట్లకి గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో టాప్ 5 వరకు వచ్చేశాడు. దీంతో ఇదే కాన్సెప్ట్​ను బిగ్‌బాస్ 8‌లో కూడా అమలుపరచనున్నారని టాక్​. ఈ సీజన్​లో కూడా 2.0 పేరుతో వైల్డ్​ కార్డ్​ ఎంట్రీలను హౌజ్​లోకి పంపిస్తారట. ఈ ఈవెంట్​ను దసరా స్పెషల్​గా అక్టోబర్​ 6వ తేదీన ప్లాన్​ చేసినట్టు సమాచారం. ఈ తేదీ కాకపోతే అక్టోబర్​ 13న నిర్వహిస్తారట.

బిగ్ బాస్ 8 : నాగమణికంఠ భార్య ఎవరో తెలిసిపోయిందిగా - పెళ్లి వీడియో వైరల్!

"బిగ్‌బాస్‌కి రావడమే నేను చేసిన.." - హౌజ్​లో బరస్ట్​ అయిన విష్ణుప్రియ - ఏం జరిగిందో తెలుసా?

బిగ్​బాస్​ 8: శేఖర్​ బాషా ఎలిమినేషన్​కు అసలు కారణం ఇది! - రెమ్యునరేషన్​ వివరాలు కూడా లీక్​

ABOUT THE AUTHOR

...view details