Lindsey Vonn Comeback : 40 ఏళ్ల వయసు అంటే, చాలా ఆటల్లో అథ్లెట్లు, ప్లేయర్లు కోచ్‌గా మారే దశ ఇది. కానీ లిండ్సే వోన్ మాత్రం అలా చేయట్లేదు. ఆటలో మళ్లీ పునరాగమనం చేస్తోంది. అది కూడా ఆటకు వీడ్కోలు పలికిన ఆరేళ్ల తర్వాత. పైగా అందులోనూ చాలా కష్టమైన స్కీయింగ్‌లో ఆమె బరిలో దిగేందుకు సిద్ధమైంది.
ఈ అమెరికా స్కీయింగ్ స్టార్ రికార్డు స్థాయిలో 28 ప్రపంచ కప్ సూపర్-జీ టైటిళ్లు సాధించింది. వింటర్ ఒలింపిక్స్‌లో ఒక గోల్డ్ మెడల్, రెండు బ్రాంజ్ మెడల్స్ కూడా సాధించింది. సెయింట్ మోరిజ్‌లో శని, ఆదివారాల్లో జరిగే స్కీయింగ్ రేసులో వోన్ తలపడనుంది. ఫిట్‌నెస్, సత్తా చాటుకోవడానికే ఈ టోర్నీలో ఆమె ఆడుతుందని తెలిపాడు వోన్ కోచ్ క్రిస్ నైట్. ఫలితంతో సంబంధం లేకుండా రాబోయే ప్రపంచకప్‌కు అవసరమైన పాయింట్లు సాధించడంపైనే ఆమె దృష్టి సారిస్తుందని పేర్కొన్నాడు. కాగా, వోన్ గాయాల కారణంగా 2019లో వోన్ ఆటకు వీడ్కోలు పలికింది.
త్వరలోనే బీసీసీఐకి కొత్త కార్యదర్శి, కోశాధికారి - ఆ రోజే ఎన్నికలు!
'ఆ మ్యాచ్ ఓటమితో కోహ్లీ బాగా ఏడ్చాడు' - అనుష్క మాటలను గుర్తుచేసుకున్న ధావన్