ETV Bharat / state

రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో అగ్నిప్రమాదం - బయటకు పరుగులు తీసిన సాఫ్ట్​వేర్ ఉద్యోగులు - FIRE ACCIDENT IN RAIDURGAM

రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం - సిలిండర్లు పేలి పాక్షికంగా దెబ్బతిన్న సమీప భవనాలు - హుటాహుటిన భవనం నుంచి బయటకు వచ్చిన పక్క భవన సాఫ్ట్​వేర్ ఉద్యోగులు

FIRE ACCIDENT IN  Bar and Restaurant
FIRE ACCIDENT IN Bar and Restaurant (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2024, 7:15 AM IST

Updated : Dec 21, 2024, 9:19 AM IST

Fire Accident in Bar and Restaurant in Raidurgam : హైదరాబాద్​ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఈ ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. సత్వ ఎలిక్సిర్ భవనంలోని ఐదో అంతస్తులో డిస్ట్రిక్ట్ 150 బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మంటలు నాలుగో అంతస్తుకు వ్యాపించి సిలిండర్లు పేలాయి.

పాక్షికంగా దెబ్బతిన్న సమీప భవనాలు : దీంతో సమీప భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పక్క భవనంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు భయాందోళనకు గురి కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్​ సిబ్బంది ఉద్యోగులను కంపెనీ నుంచి బయటకు పంపించారు. అనంతరం మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పారు.

సిటీ నడిబొడ్డున పెట్రోల్‌ ట్యాంకర్లో మంటలు - చాకచక్యంగా వ్యవహరించిన మహిళా ఏసీపీ

Last Updated : Dec 21, 2024, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.