ETV Bharat / entertainment

రీల్​ రివైండ్ 2024 - ఈ సీక్వెల్స్​ పరిస్థితేంటంటే? - 2024 SEQUEL MOVIES

2024లో థియేటర్లలోకి వచ్చిన సీక్వెల్స్​ ఇవే - వీటిలో జైత్రయాత్ర కొనసాగించినవెన్ని? అంచనాలు అందుకోలేక చతికిలపడినవెన్ని?

2024 Sequel Movies
2024 Sequel Movies (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

2024 Sequel Movies : సాధారణంగా ఓ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌ వస్తుందంటే దానిపై చాలా మంది సినీప్రియుల్లో దానిపై భారీ అంచనాలు ఉంటాయి. అలా ఈ ఏడాది మంచి అంచనాలతో బాక్సాఫీస్‌ ముందుకొచ్చిన సీక్వెల్​ చిత్రాలు అరడజనుకుగా పైగా ఉన్నాయి. మరి వాటిలో జైత్రయాత్ర కొనసాగించినవెన్ని? అంచనాలు అందుకోలేక చతికిలపడినవెన్ని? చూసేద్దాం

రెండేళ్ల క్రితం డీజే టిల్లు చిత్రంతో సినీ ప్రియుల్ని కడుపుబ్బా నవ్వించిన యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ, ఈ ఏడాది మరోసారి అదే పాత్రలో టిల్లు స్క్వేర్‌తో థియేటర్లలో సందడి చేశారు. మల్లిక్‌ రామ్‌ తెరకెక్కించిన ఈ సీక్వెల్‌ చిత్రం, మార్చి నెలాఖరున విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాన్ని దక్కించుకుంది. టిల్లుగా సిద్ధు చేసిన అల్లరి, రాధికగా అనుపమ అభినయం, యాక్షన్‌ హంగామా మూవీ లవర్స్​కు బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సక్సెస్​ఫుల్​ మూవీకి కొనసాగింపుగా టిల్లు క్యూబ్‌ను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు సిద్ధు.

నారా రోహిత్‌ నటించిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ ప్రతినిధికి కొనసాగింపుగా ఈ ఏడాది ప్రతినిధి 2 విడుదలైంది. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సినీప్రియుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

ఈ ఏడాది సెకండాఫ్​లో ముచ్చటగా మూడు సీక్వెల్‌ చిత్రాలు వస్తున్నాయి. వాటిలో రెండు సినిమాలు బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించాయి. పుష్ప : ది రైజ్‌ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌, ప్రస్తుతం పుష్ప 2: ది రూల్‌తో బాక్సాఫీస్‌కు వైల్డ్‌ఫైర్‌ను రుచి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1500కోట్ల పైగా వసూళ్లను అందుకుందీ చిత్రం. త్వరలోనే రూ.2000కోట్ల మార్క్​ను టచ్ చేస్తుందని అంతా ఆశిస్తున్నారు. ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప : ది ర్యాంపేజ్‌ తెరపైకి రానుంది.

మత్తు వదలరా చిత్రంతో ఎంతటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది సెప్టెంబరులో మత్తు వదలరా 2తో వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శ్రీసింహా కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ చక్కటి వసూళ్లను అందుకుంది. త్వరలో దీనికి కొనసాగింపుగా మత్తు వదలరా 3 రానుంది.

హీరో రామ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబోలో వచ్చిన హిట్ సినిమా ఇస్మార్ట్‌ శంకర్‌. దీనికి కొనసాగింపుగా ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన డబుల్‌ ఇస్మార్ట్‌ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి చేదు ఫలితాన్ని అందుకుంది.

'పుష్ప 2' ఓటీటీ రిలీజ్​పై మూవీటీమ్ క్లారిటీ - విడుదల​ అప్పుడే

చిరంజీవితో కలిసి నటించడంపై స్పందించిన మోహన్‌బాబు - ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.