తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆమెతో రెహమాన్ విడాకులకు లింక్!​ - అసలు ఎవరీ మోహినీ దే? - WHO IS AR RAHMANS BASSIST MOHINI

రెహమాన్ విడాకులకు - మోహినిదే డివోర్స్​కు ఏదైనా సంబంధం ఉందా? అంటూ వస్తోన్న వార్తలపై స్పందించిన రెహమాన్ భార్య సైరా తరఫు లాయర్‌.

AR Rahmans Bassist Mohini Dey
AR Rahmans Bassist Mohini Dey (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 9:55 AM IST

AR Rahmans Bassist Mohini Dey : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్‌ తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించి షాక్​కు గురి చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 29 సంవత్సరాల తన వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. అయితే ఇదే సమయంలో ఏఆర్‌ రెహమాన్‌ టీమ్‌లోని మోహినిదే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం అందరినీ షాక్​కు గురి చేసింది. ఏఆర్‌ రెహమాన్‌ దంపతులు విడిపోతున్నట్లుగా ప్రకటించిన కొద్ది గంటల్లోనే మోహినిదే కూడా డివోర్స్‌పై ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు విడాకులకు ఏదైనా సంబంధం ఉందా? అంటూ చాలా మంది చర్చించుకోవడం మొదలు పెట్టారు. అసలు మెహినిదే ఎవరని ఆరా తీస్తున్నారు.

సైరా తరఫున లాయర్‌ ఏం అన్నారంటే?

రెహమాన్ విడాకులకు - మోహినిదే డివోర్స్​కు ఏదైనా సంబంధం ఉందా? అంటూ వస్తోన్న వార్తలపై రెహమాన్ భార్య సైరా తరఫు లాయర్‌ వందన స్పందించారు. అలాంటిదేమీ లేదని స్పష్టత ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే రెహమాన్‌ - సైరా దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

అసలు ఎవరీ మెహినిదే?(Who is Mohini Dey)

మోహినిదే కోల్‌కతా నివాసి. ముంబయిలో పెరిగింది. ఆమె బాస్‌ ప్లేయర్‌. ప్రపంచవ్యాప్తంగా ఏఆర్‌ రెహమాన్‌తో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్​గా ఉంటుంది. తన పెర్​ఫార్మెన్స్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేస్తుంటుంది. ఆమెకు 527కే ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

విడాకులపై రెహమాన్​ ఏమన్నారంటే? - "30ఏళ్ల వైవాహిక బంధానికి చేరుకుంటామని అనుకున్నాం. కానీ అనుకోని విధంగా ఇలా ముగింపు పలకాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఒక్కసారి పగిలిన హృదయం తిరిగి అతకదు. విడిపోయినా మా దారుల్ని అర్థవంతంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ బలహీన అధ్యాయాన్ని అధిగమించేటప్పుడు తమ గోప్యతను గౌరవించిన మిత్రులకు కృతజ్ఞతలు" అని అన్నారు.

29 ఏళ్ల వివాహ బంధానికి ఏఆర్​ రెహమాన్ దంపతులు స్వస్తి

'మిమ్మల్ని పురుషులు అవమానిస్తే అలా చేయండి' - ఆడవారికి సమంత సూక్తులు

ABOUT THE AUTHOR

...view details