ETV Bharat / state

మరింత సమాచారం కోసం ఒకటి నొక్కాడు - హడలెత్తిపోయాడు! - CYBER FRAUD IN HYDERABAD

-కొడుకును చంపేస్తామని బెంబేలెత్తించిన సైబర్ నేరగాళ్లు -కుటుంబ సభ్యులకు చెప్పలేక మోసగాళ్లకు చిక్కిన వృద్ధుడు

Cyber Fraud in Hyderabad
Cyber Fraud in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Cyber Fraud in Hyderabad : "మీ పేరు సత్యనారాయణేనా? కన్ఫామ్ చేసినందుకు ధన్యవాదాలు. మేము ఇంటర్నేషనల్ డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాం. మీరు మరింత సమాచారం కోసం ఒకటి నొక్కండి" అని అవతలి నుంచి గొంతు పలికింది. చెప్పినట్టుగానే సత్యనారాయణ ఒకటి నొక్కారు. ఆ తర్వాత ఏం జరిగింతో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్ నగరానికి చెందిన సత్యనారాయణ (పేరు మార్చాం) వయసు 61 సంవత్సరాలు. ప్రేవేటు ఉద్యోగిగా ఉన్నారు. ఆయనకు ఇంటర్నేషనల్‌ డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆఫీసు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ లిఫ్ట్​ చేసిన తర్వాత సత్యనారాయణ వివరాలు కన్ఫామ్ చేసుకున్నారు. ఆ తర్వాత అదనపు సమాచారం కోసం మొబైల్​లో ఒకటో నంబర్​ నొక్కండి అని చెప్పారు. ఆయన అలాగే చేశారు. వెంటనే అవతలి నుంచి ఓ వ్యక్తి లైన్లోకి వచ్చి, మీ పేరు మీద ఒక పార్శిల్‌ వచ్చిందని, అందులో 140 గ్రాముల డ్రగ్స్, 5 పాస్‌పోర్టులు ఉన్నాయని చెప్పారు.

సత్యనారాయణ హడలిపోయారు. ఆ పార్శిల్ తనది కాదని, తనకు దానితో ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు. దీంతో మీరు లైన్​లోనే ఉండాలని, ఢిల్లీ సైబర్ సెల్ అధికారికి కనెక్ట్ చేస్తున్నామని చెప్పాడు అవతలి వ్యక్తి. అప్పుడు మరో వ్యక్తి లైన్​లోకి వచ్చి ఢిల్లీ సైబర్ సెల్ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పాడు. నిషేధిత డ్రగ్స్​, పాస్​ పోర్టు మాత్రమే కాకుండా, మీరు 4 బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని బెదిరించాడు.

ఇప్పుడు మీరు ఎక్కడికీ పారిపోలేరని, పూర్తిగా మా నిఘాలో ఉన్నారని చెప్పాడు. ప్రతి గంటకూ మీకు ఫోన్ చేస్తూనే ఉంటామని, తమకు రిపోర్టు చేయాలని సూచించాడు. అదే సమయంలో ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదని, చివరకు కుటుంబ సభ్యులనూ ఈ విషయం షేర్​ చేసుకోవద్దని అన్నారు. తమ మాటలు కాదని, ఎవరితోనైనా చెబితే కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి, హత్య చేస్తామని బెదిరించారు. దీంతో సత్యనారాయణ మరింతగా బెదిరిపోయారు.

వెంటనే తాము చెప్పిన బ్యాంకు అకౌంట్​కు RTGS పద్ధతిలో డబ్బులు ట్రాన్స్​ఫర్​ చేయాలని అన్నారు. ఆ తర్వాత గంట, గంటకూ తమకు ఫోన్‌ లో అందుబాటులో ఉండాలని, తాము ఫోన్ చేస్తే తప్పకుండా లిఫ్ట్​ చేయాలని చెప్పారు. లేకపోతే మీ కొడుకు ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. తక్షణం ఫెడరల్‌ బ్యాంక్‌ అకౌంట్​కు డబ్బు సెండ్​ చేయాలని చెప్పడంతో తన డిపాజిట్‌ సొమ్ము నుంచి 20 లక్షల రూపాయలు పంపించారు సత్యనారాయణ. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వేధింపులు చేస్తుండడంతో చివరకు ఆ విషయాన్ని కుమారుడికి చెప్పారు. వెంటనే అతను 1930 నంబరు ద్వారా సైబర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.